Advertisement

ఆచార్య‌లో నేనే.. క‌న్ఫ‌మ్ చేసిన ఆమె

Posted : March 23, 2020 at 12:53 pm IST by ManaTeluguMovies

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఆచార్య‌లో హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యంలో స‌స్పెన్సుకు తెర‌ప‌డిన‌ట్లే. కొరటాల శివ దర్శకత్వంలో చిరు చేస్తున్నఈ సినిమాకు ముందు త్రిషను కథానాయికగా ఎంచుకోగా.. అనివార్య కారణాలతో ఆమె తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో అత్యవసరంగా ఆమె స్థానాన్ని మరో సీనియర్ హీరోయిన్‌తో భర్తీ చేయాల్సిన అవసరం పడింది.

ఈ పాత్ర‌కు ప్ర‌ధానంగా కాజ‌ల్ అగర్వాల్, అనుష్క‌ల పేర్లు వినిపించాయి. ఐతే రేసులో అనుష్క‌ను వెన‌క్కినెట్టి కాజ‌ల్‌నే ఫైన‌ల్ చేసిన‌ట్లు తేలిపోయింది. ఆచార్య‌లో త‌నే హీరోయిన్ అంటూ స్వ‌యంగా కాజ‌లే వెల్ల‌డించ‌డం విశేషం.

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం నేప‌థ్యంలో ఖాళీగా ఉన్న కాజ‌ల్ అగ‌ర్వాల్.. తాజాగా అభిమానుల‌తో ఇన్‌స్టాగ్రామ్ చాట్ చేసింది. ఈ సంద‌ర్భంగా ఓ నెటిజన్ కాజల్‌ను మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటని ప్రశ్నించగా చిరు సార్ సినిమాలో చేస్తున్నానని, ప్రస్తుతం షూటింగ్ హోల్డ్‌లో ఉండటం వల్ల.. ఇంటి దగ్గరే సినిమా కోసం రెడీ అయ్యేందుకు వర్క్ చేస్తున్నానని తెలిపింది. దీంతో ఆచార్య హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్లు అయ్యింది.

కెరీర్ ఇప్పుడున్న ద‌శ‌లో కాజ‌ల్‌కు ఇది బంప‌రాఫ‌ర్ అనే చెప్పాలి. రెండు మూడేళ్ల కిందటే ఆమె రేంజ్ పడిపోయింది. ఇంతకుముందులా స్టార్లు ఆమెను ప్రిఫర్ చేయట్లేదు. గత మూడేళ్లలో కాజల్ నటించిన పెద్ద సినిమా అంటే ‘ఖైదీ నంబర్ 150’ మాత్రమే. అదే అనుకోకుండా ద‌క్కిన అవ‌కాశం అంటే.. మ‌రోసారి చిరు ప‌క్క‌న సినిమా చేయ‌డ‌మంటే కాజ‌ల్ న‌క్క తోక తొక్కిన‌ట్లే.


Advertisement

Recent Random Post:

Botsa Satyanarayana Gets Emotional Over Jagan Comments | YSRCP | AP Elections 2024

Posted : April 24, 2024 at 12:42 pm IST by ManaTeluguMovies

Botsa Satyanarayana Gets Emotional Over Jagan Comments | YSRCP | AP Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement