Advertisement

అల్లరోడి సినిమా ఒక్కటీ చూడకుండానే పెళ్లి

Posted : April 17, 2020 at 12:13 pm IST by ManaTeluguMovies

సినిమా హీరోను బయటి అమ్మాయి ఎవరైనా పెళ్లాడింది అంటే.. అప్పటికే ఆ హీరో సినిమాలు కొన్ని అయినా చూసి ఉంటుందని అనుకుంటాం. అంతకుముందు వరకు ఆ హీరో సినిమాలు చూడకపోయినా సరే.. కనీసం పెళ్లి ఫిక్సయ్యాక అయినా తనకు కాబోయే భర్త సినిమాలు వరుసబెట్టి చూసెయ్యాలి. కానీ అల్లరి నరేష్ భార్య విరూప కంటమ్నేని మాత్రం.. అతడితో పెళ్లి అయ్యే ముందు వరకు తన సినిమా ఒక్కటంటే ఒక్కటీ చూడలేదట.

అల్లరోడిని పెళ్లి చేసుకున్న రెండు వారాల తర్వాత అతడి తొలి సినిమాను చూసిందట. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా విరూపనే ఇటీవల వెల్లడించడం విశేషం. అల్లరి నరేష్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన ‘నేను’.. తన భర్త సినిమాల్లో తాను చూసిన మొదటిదని ఆమె వెల్లడించింది.

‘నేను’ సినిమాకు 16 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో క్లైమాక్స్‌లో నరేష్ అద్భుతంగా నటించిన ఓ సన్నివేశం తాలూకు ఫొటో పెట్టి.. ఈ సినిమా రిలీజైనప్పటి కంటే తర్వాతి కాలంలో రావాల్సిందని.. ఇందులో నరేష్ అద్భుతంగా నటించాడని పేర్కొంది. 2004లో ఈ సినిమా రిలీజైతే.. తాను నరేష్‌ను పెళ్లాడిన రెండు వారాలకు.. అంటే 2011లో ఈ సినిమా చూశానని ఆమె వెల్లడించింది.

విరూప కంటమ్నేని అనే పేరు చూస్తే ఈమె తెలుగమ్మాయే అని చెప్పేయొచ్చు. ఐతే విరూప పుట్టి, పెరిగిందంతా చెన్నైలోనే. ఆమెకు తమిళ సినిమాల మీదే ఆసక్తి ఎక్కువ అని.. తన ట్విట్టర్ పేజీని పరిశీలిస్తే అర్థమవుతుంది. అయినా సరే.. నరేష్‌తో పెళ్లి ఫిక్సయ్యాక అయినా అతడి సినిమాలు చూడలేదంటే.. పెళ్లయిన తర్వాతే అతడి తొలి సినిమా వీక్షించిందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఐతే పెళ్లి సమయానికి మంచి ఫాంలోనే ఉన్న నరేష్.. తర్వాతి ఏడాది ‘సుడిగాడు’తో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. కానీ పాపం ఆ తర్వాతే అతడికి హిట్టు అన్నదే లేకపోయింది.


Advertisement

Recent Random Post:

ఏపీ కి ప్రధాని మోడీ..షెడ్యూల్ ఖరారు | PM Modi AP Tour | AP Elections 2024 |

Posted : April 23, 2024 at 1:23 pm IST by ManaTeluguMovies

ఏపీ కి ప్రధాని మోడీ..షెడ్యూల్ ఖరారు | PM Modi AP Tour | AP Elections 2024 |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement