Advertisement

#BB3 మొదలయ్యేది ఎప్పుడు?

Posted : January 18, 2021 at 12:48 pm IST by ManaTeluguMovies

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్‌ లో రూపొందుతున్న మూవీ షూటింగ్ గత ఏడాది మార్చిలో కరోనా కారణంగా నిలిచి పోయింది. ఈ సినిమా మాత్రమే కాకుండా అన్ని భాషల సినిమాలు కూడా నిలిచి పోయాయి. అయితే దాదాపు అన్ని సినిమాలు కూడా గత ఏడాది పునః ప్రారంభం అయ్యాయి. కాని బాలకృష్ణ మరియు బోయపాటి మూవీ బిబి3 మాత్రం ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. గత ఏడాది ఆరంభంలోనే హడావుడి చేసిన బోయపాటి కరోనా భయంతో సినిమాను వాయిదా వేస్తూ వచ్చాడు.

కొత్త ఏడాదిలో అయినా ప్రారంభం అవుతుందని ఆశించిన నందమూరి అభిమానులకు నిరాశే మిగిలింది. జనవరి పూర్తి కాబోతున్నా ఇప్పటి వరకు షూటింగ్‌ అప్‌ డేట్‌ ఇవ్వలేదు. సినిమాను సమ్మర్‌ చివర్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ఆ చిత్ర నిర్మాత మిర్యాల రాజేందర్ చెప్పారు. సినిమా ఆ సమయం వరకు విడుదల అవ్వాలంటే షూటింగ్‌ ఇప్పటికే మొదలు పెట్టాలి. కాని బాలయ్య బోయపాటి మూవీ ఇంకా పట్టాలెక్కక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక సమస్యలు ఏమైనా తలెత్తాయా అంటూ కూడా కామెంట్‌ లు వినిపిస్తున్నాయి. ఆ పుకార్లను కొట్టి పారేసి యూనిట్‌ సభ్యులు ఎప్పుడెప్పుడు షూటింగ్‌ పునః ప్రారంభిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Advertisement

Recent Random Post:

YS Jagan Will Become CM | Actor Vishal | AP Elections 2024

Posted : April 22, 2024 at 8:56 pm IST by ManaTeluguMovies

YS Jagan Will Become CM | Actor Vishal | AP Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement