Advertisement

అఘోర బాలయ్య.. కాకపోతే ఇంకాస్త కొత్తగా!

Posted : April 30, 2020 at 8:47 pm IST by ManaTeluguMovies

బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమాలో బాలయ్య అఘోరాగా కనిపించబోతున్నారనే టాక్ చాన్నాళ్లుగా నడుస్తోంది. అది నిజమనే విషయాన్ని కూడా గతంలో గ్రేట్ ఆంధ్ర స్పష్టంచేసింది. ఇప్పుడదే విషయాన్ని బోయపాటి కూడా కన్ ఫర్మ్ చేశారు. బాలయ్య ఓ షేడ్ లో అఘోరాగా కనిపిస్తారని, కాకపోతే సెటప్ అంతా కొత్తగా ఉంటుందంటున్నారు.

“సింహా, లెజెండ్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి వందకు వందశాతం తీవ్రంగా కష్టపడుతున్నాను. ఆల్రెడీ ఆ రెండు సినిమాలు చూశారు కాబట్టి, ఈసారి ఓ కొత్త క్యారెక్టరైజేషన్ ఎత్తుకుంటున్నాం. అంతా చెబుతున్నట్టు అఘోరా టైపు క్యారెక్టర్ ఒకటి ఉన్నమాట వాస్తవమే. దాన్ని ఎలా డిజైన్ చేశాం, ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సింహా, లెజెండ్ నుంచి కొంచెం బయటకొచ్చి కొత్తగా ఏదైనా చేయాలంటే అఘోరా లాంటి పాత్ర, క్యారెక్టరైజేషన్ కావాల్సిందే.”

ఇలా కొత్త సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందనే విషయాన్ని బయటపెట్టాడు బోయపాటి. బాలయ్య విషయంలో దర్శకులంతా కేవలం కథ-డైలాగ్స్ మాత్రమే చూస్తారని… తను మాత్రం బాలయ్య బాడీలాంగ్వేజ్ చూస్తానంటున్నాడు బోయపాటి. అందుకే తన కథలకు బాలయ్య చప్పున గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే సీక్రెట్ ను బయటపెట్టాడు.

“సింహా సినిమాను 20 నిమిషాల్లో ఒప్పించాను. లెజెండ్ కూడా అంతే. 20-25 నిమిషాల్లో ఓకే చేయించుకున్నాను. ఆయనలో ఉన్న క్వాలిటీ అదే. బాలయ్య కొత్తదనం ఎంకరేజ్ చేస్తారు. కొత్త కథ అంటే చాలు ఆయన ప్రోత్సహిస్తారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన తగ్గరు. కొత్త కథ అనిపిస్తే ఏ దర్శకుడైనా అవకాశం ఇచ్చేస్తారు.”

బాలయ్య సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ లో ఓ మంచి ఎపిసోడ్, మరో 2 సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని తెలిపిన బోయపాటి… ఈ లాక్ డౌన్ టైమ్ లో స్క్రిప్ట్ పై మరింత వర్క్ చేశానని చెబుతున్నాడు.


Advertisement

Recent Random Post:

Manamey Official Teaser | Sharwanand, Krithi Shetty | Sriram Adittya | Hesham Abdul Wahab

Posted : April 19, 2024 at 3:10 pm IST by ManaTeluguMovies

Manamey Official Teaser | Sharwanand, Krithi Shetty | Sriram Adittya | Hesham Abdul Wahab

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement