Advertisement

నాగార్జునపై నారాయణ తీవ్ర వ్యాఖ్యలు

Posted : December 27, 2020 at 7:33 pm IST by ManaTeluguMovies

సినీనటుడు నాగార్జున పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షోలో మహిళలను కించపరిచేలా నాగ్ వ్యవహరించారని దుయ్యబట్టారు. తీవ్రమైన పదజాలంతో నాగార్జునపై నారాయణ వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించింది. స్టార్ మా టీవీలో ఇటీవల బిగ్ బాస్ షో ముగిసిన సంగతి తెలిసిందే. దీనికి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించిన విషయమూ విదితమే. వాస్తవానికి ఈ షోపై కొందరు విమర్శలు చేసినా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ షో పట్ల ఆదరణ ఎక్కువగా ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు.

అయితే, నారాయణ ఆదివారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ.. నాగార్జునపై విరుచుకుపడ్డారు. ఆయన సినిమాలు చూస్తుంటానని, ఆయన నటన అంటే అభిమానమని చెబుతూనే బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున దారుణమైన పనులు చేశారని విమర్శలు గుప్పించారు. ఆ షోలో ముగ్గురు యువతుల ఫొటోలు పెట్టి.. ఒక యువకుడిని ఎవరికి ముద్దు పెడతావు? ఎవరితో డేటింగ్ చేస్తావు? ఎవరిని పెళ్లి చేసుకుంటావని అడిగారని విమర్శించారు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.

ఆయన కుటుంబంలోని మహిళా నటుల ఫొటోలు పెట్టి అలా అడగగలరా అని నిలదీశారు. బిగ్ బాస్ పై హైకోర్టులో కేసు వేస్తానని చెప్పారు. వెంటనే నాగార్జున తెలుగు సమాజానికి క్షమాపణ చెప్పకుంటే ఎంతవరకు అయినా పోరాడతానని నారాయణ స్పష్టంచేశారు.


Advertisement

Recent Random Post:

Ranarangam : కమల విలాపం.. గ్లాసులో తుఫాను

Posted : March 23, 2024 at 10:07 pm IST by ManaTeluguMovies

Ranarangam : కమల విలాపం.. గ్లాసులో తుఫాను

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement