Advertisement

నిరుత్సాహ‌ప‌డుతున్న‌ గంగ‌వ్వ అభిమానులు

Posted : September 15, 2020 at 7:07 pm IST by ManaTeluguMovies

బిగ్‌బాస్ హౌస్‌లో ఎక్కువ‌మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ ఎవ‌రు? అన్న ప్ర‌శ్న పూర్త‌య్యేలోపే గంగ‌వ్వ అని చ‌టుక్కున స‌మాధానం చెప్పేస్తారు. ఈ షో చూడ‌ని వాళ్లు కూడా ఆమెకోసం స‌మ‌యం కేటాయించి మ‌రీ ఓట్లు గుద్దుతారంటేనే అర్థం చేసుకోవాచ్చు ఆమె తెలుగు ప్రేక్షకులకు ఎంత‌గా న‌చ్చేసిందో. క‌ల్లాక‌పటం లేని మ‌న‌సు, ముక్కుసూటిత‌త్వం, క‌ష్ట‌ప‌డి పైకొచ్చిన విధానం, మాట‌తీరు మ‌రెన్నో సుగుణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడ‌వే బిగ్‌బాస్ హౌస్‌లో ఆమెకు అడుగ‌డుగునా అడ్డుప‌డుతున్నాయి. లేని ఎమోష‌న్స్‌ను న‌టించ‌డం రాదు, పోనీ అలా న‌టించిన‌వారితో క‌లిసిపోనూలేదు.

నా వ‌ల్ల కాదు బిడ్డా..
అక్క‌డున్న అంద‌రూ ఆమె ఈడుకు త‌గ్గ వాళ్లు కాక‌పోయినా అంద‌రితో బాగానే మాట్లాడుతోంది. అయినా ఎందుకో ఇమ‌డ‌లేక‌పోతోంది. “నా వ‌ల్ల కాదు బిడ్డా, నేను పోతా” అని ప‌దే ప‌దే అభ్య‌ర్థిస్తోంది. దానికి నాగ్ బ‌దులు చెప్ప‌లేక అది ప్రేక్ష‌కుల చేతిలో ఉంది, తానేం చేయ‌లేను అని చేతులెత్తేశారు. నిన్న‌టి నామినేష‌న్ ప్ర‌క్రియ‌లోనూ అవ్వే మొద‌ట‌గా ప‌డ‌వ దిగి వెళ్లిపోవాల‌న్న కోరిక‌ను మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింది. కానీ బిగ్‌బాస్ యాజ‌మాన్యం అందుకు ఒప్పుకుంటుందా? టీఆర్పీ కోసం ఏరికోరి తెచ్చుకున్న అవ్వ‌ను వ‌దులుకుంటుందా? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.
నీరుగారిపోతున్న అభిమానుల ఆశ‌లు
పైగా బిగ్‌బాస్ హౌస్‌లో వినోదాన్ని పంచుతున్న ఏకైక వ్య‌క్తి అవ్వ‌. ఆమెతోనే స‌రదాలు, ఆమె వేసే పంచ్‌ల‌తోనే ప్రోమోలు, ఎపిసోడ్లు గ‌డిచితున్నాయి. అలాంటి అవ్వ వెళ్లిపోతే షో బోసిపోతుందేమో అన్న సందేహం బిగ్‌బాస్ టీమ్‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తుందేమో! కానీ ఎన్నాళ్లు ఊర‌డించినా అవ్వ ఎక్కువ రోజులైతే ఉండ‌లేదు. ఇదే వాస్త‌వం. కాదు, కూడ‌దు అంటే బిగ్‌బాస్‌తోనే ల‌డాయి పెట్టుకుని మ‌రీ ఇంట్లో నుంచి వెళ్లిపోయే ర‌కం. దీంతో ఎలాగైనా గంగ‌వ్వ‌ను గెలిపిద్దామ‌ని కోటి ఆశ‌లు పెట్టుకున్న అభిమానులు నిరుత్సాహ‌ప‌డుతున్నారు. ఆమెను పంపించ‌డానికి ఏమాత్రం ఇష్టం సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం లేదు. కానీ వ‌య‌సుతోపాటు వ‌చ్చే అనారోగ్య‌ స‌మ‌స్య‌లు, హౌస్‌లో ఉన్న కృత్రిమ‌త్వం ఆమెను ఉండ‌నివ్వ‌ట్లేదు. కాబ‌ట్టి షో కాస్త పుంజుకునేవర‌కు ఎదురు చూసి బిగ్‌బాస్ యాజ‌మాన్యమే ఆమెను నేరుగా ఇంటికి పంపించే అవ‌కాశాలు ఉన్నాయి.


Advertisement

Recent Random Post:

పెట్రోల్ ధరల పెంపుపై లోకేష్ ఫైర్ | Nara Lokesh Fires over Petrol Price Hike in AP

Posted : September 19, 2020 at 9:22 pm IST by ManaTeluguMovies

పెట్రోల్ ధరల పెంపుపై లోకేష్ ఫైర్ | Nara Lokesh Fires over Petrol Price Hike in AP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement