Advertisement

ప్రత్యేక హోదా వస్తుంది – జగన్

Posted : May 28, 2020 at 9:55 pm IST by ManaTeluguMovies

ఏపీలో గత ఎన్నికలకు జగన్ తీసుకున్న అతి ముఖ్యమైన నినాదాల్లో ఒకటి ప్రత్యేక హోదా. ఈ విషయం గురించి తొలి రెండు నెలలు మాత్రమే కొంత చర్చ జరిగింది. మోడీని కలిసినపుడు ఆయనకు ఎక్కువ సీట్లు ఉన్నాయి.

మనం డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేము, రిక్వెస్ట్ చేసుకోవాలి అని జగన్ అప్పట్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది. ఆ తర్వాత పార్టీ ఆ విషయం గురించి పెద్దగా ప్రస్తావించలేదు. దీంతో స్పెషల్ స్టేటస్ అంశాన్ని ఆ పార్టీ వాడుకుని వదిలేసిందని ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వచ్చాయి. అయితే, తనే స్వయంగా ప్రత్యేక హోదాను ప్రస్తావిస్తూ జగన్ ఈరోజు మాట్లాడారు.

మన పాలన – మీ సూచన అంటూ జగన్ వరుసగా నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగో రోజు పెట్టబడుల గురించి ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిందనది, కానీ హామీ నిలబెట్టుకోలేదని, ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఎంతో మంచి జరుగుతుందని, ఈపాటికే ఎన్నో పరిశ్రమలు వచ్చేవని జగన్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నులు, జీఎస్టీ మినహాయింపులు దక్కేవని ఇవి పరిశ్రమలు విరివిగా రావడానికి దోహదం చేసేదన్నారు జగన్.

ఆనాడు మోడీతో అన్న మాటలే ప్రస్తావించారు. మనలాగే కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయిలో సీట్లు వచ్చాయని… లేకపోతే మనకున్న సంఖ్యాబలంతో ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసే వాళ్లం అని జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ సందర్భంగా జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు బీజేపీకి షాకిచ్చేలా ఉండటం విశేషం.

ప్రత్యేక హోదాకు ప్రస్తుతం దూరంగా ఉండాల్సి వస్తుంది. కానీ కేంద్రంలో రాబోయే ప్రభుత్వం ఇతర పార్టీలపై ఆధారపడక తప్పదని అపుడు ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకి తెస్తామన్నారు. అంటే జగన్ మాటల్లో చాలా స్పష్టంగా కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీట్లు గణనీయంగా పడిపోతాయని, సొంత మెజారిటీతో గెలవదని అర్థం వచ్చేలా మాట్లాడారు. అదే సమయంలో తమ పార్టీ మళ్లి గెలుస్తుందన్న ఆత్మవిశ్వాసాన్ని వెలిబుచ్చారు.

ఇక టీడీపీ ప్రత్యేక హోదా గురించి ప్రజలను మోసం చేసిందని, నాలుగేళ్లు బీజేపీతో ఉండి కూడా ప్రత్యేక హోదాను సాధించలేకపోయిందన్నారు. పరిశ్రమల విషయంలో తెలుగుదేశం అబద్ధాలు చెప్పిందన్నారు. ఎన్నో కంపెనీలు ఏపీకి వస్తున్నాయని అవాస్తవాలు చెప్పారన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఫస్ట్ ర్యాంక్ మీడియాను మేనేజ్ చేసి సాధించారని జగన్ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.


Advertisement

Recent Random Post:

Begumpet : ప్రాణాలకు తెగించిన తల్లీకూతురు.. తుపాకీకి ఎదురొడ్డి విరోచిత పోరాటం – TV9

Posted : March 22, 2024 at 11:33 am IST by ManaTeluguMovies

Begumpet : ప్రాణాలకు తెగించిన తల్లీకూతురు.. తుపాకీకి ఎదురొడ్డి విరోచిత పోరాటం – TV9

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement