Advertisement

ఈ ఏడాది అన్ని చోట్ల మహేష్‌ పై బన్నీ విజయం

Posted : December 30, 2020 at 4:44 pm IST by ManaTeluguMovies

2020 సంవత్సరం మొత్తం కూడా కరోనా మయం అయ్యింది. ఈ ఏడాది మొదట్లో కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. అంతే తప్ప మరే సినిమాలు కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ ఏడాది విడుదల అయిన సినిమాల్లో అల వైకుంఠపురంలో మరియు సరిలేరు నీకెవ్వరు సినిమాలు సక్సెస్‌ అయ్యాయి. ఈ రెండు కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కలెక్షన్స్ విషయంలో హోరా హోరీ పోరాడి చివరకు అల వైకుంఠపురంలో సినిమా విజయాన్ని సొంతం చేసుకుని ఆల్‌ టైం రికార్డును సొంతం చేసుకుంది.

ఈ ఏడాదిలో విడుదలైన పెద్ద హీరోల సినిమాలు కేవలం రెండే కనుక ప్రతి చోట కూడా ఈ రెండు సినిమాలే పోటీ పడ్డాయి. యూట్యూబ్‌ పాటల రికార్డు, రేటింగ్‌ విషయం, డిజిటల్‌ ప్రీమియర్‌, శాటిలైట్ ప్రీమియర్‌ ఇలా అన్నింట్లో కూడా ఈ రెంటి మద్య పోటీ జరిగింది. కాని అన్ని చోట్ల కూడా అల్లు అర్జున్‌ నటించిన అల వైకుంఠపురంలో విజయం సాధించింది. పాటల నుండి శాటిలైట్‌ రికార్డు వరకు అన్ని రికార్డులు బన్నీ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాదిలో అన్ని రికార్డులను అల వైకుంఠపురంలో సొంతం చేసుకోవడం జరిగింది. మహేష్ బాబుకు ఏ ఒక్క రికార్డు కూడా దక్కలేదు. అన్ని చోట్ల కూడా నెం.2 స్థానంలోనే సరిలేరు నీకెవ్వరు నిలిచింది.


Advertisement

Recent Random Post:

బీఆర్ఎస్‌కు కడియం శ్రీహరి, కావ్య గుడ్‌బై

Posted : March 29, 2024 at 11:46 am IST by ManaTeluguMovies

బీఆర్ఎస్‌కు కడియం శ్రీహరి, కావ్య గుడ్‌బై

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement