Advertisement

మరోసారి బిగ్ బాస్ స్టేజ్ పై నాని

Posted : November 18, 2020 at 6:12 pm IST by ManaTeluguMovies

న్యాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సెకండ్ సీజన్ ను హోస్ట్ చేసాడు. సెకండ్ సీజన్ టిఆర్పిల పరంగా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అయితే నాని కొన్ని పరిస్థితుల కారణంగా ట్రోలింగ్ కు గురి కావాల్సి వచ్చింది. హోస్టింగ్ పరంగా మంచి మార్కులే వేయించుకున్నా కానీ నాని థర్డ్ సీజన్ కు హోస్ట్ చేయాలనుకోలేదు.

నాని స్థానంలో బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున వచ్చాడు. థర్డ్ సీజన్ ను విజయవంతంగా నడిపించిన తర్వాత నాలుగో సీజన్ ను కూడా నాగ్ ముందుండి నడిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ మూడో సీజన్ లో ఒక స్పెషల్ ఎపిసోడ్ కు నాని వచ్చిన విషయం తెల్సిందే. అలాగే ఇప్పుడు నాలుగో సీజన్ కు నాని వస్తాడని తెలుస్తోంది.

మరోసారి నాని బిగ్ బాస్ స్టేజ్ పై హల్చల్ చేయనున్నాడు. ఈ ఎపిసోడ్ ను చాలా స్పెషల్ గా ఉండేలా ఇప్పటినుండే ప్లాన్ చేస్తున్నారట. రీసెంట్ గా సమంత దసరా స్పెషల్ బిగ్ బాస్ ఎపిసోడ్ కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఆ ఎపిసోడ్ కు రికార్డు టీఆర్పీలు వచ్చాయి.


Advertisement

Recent Random Post:

Raghunandan Rao Comments on Bhainsa Incident

Posted : November 22, 2020 at 9:37 pm IST by ManaTeluguMovies

Raghunandan Rao Comments on Bhainsa Incident

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement