Advertisement

పెళ్లి కూతురుగా ట్రెండ్‌ అవుతున్న నయన్‌

Posted : November 16, 2020 at 7:30 pm IST by ManaTeluguMovies

సౌత్‌ ఇండియా సెన్షేషన్‌ నయన్‌తార. లేడీ సూపర్‌ స్టార్‌ అంటూ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఆమెను పిలుస్తున్నారు. అంతటి గుర్తింపు దక్కించుకున్న ఈమె పెళ్లి విషయమై గత రెండు మూడు సంవత్సరాలుగా రెగ్యులర్‌గా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈమె ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో రిలేషన్‌లో ఉంది. సుదీర్ఘ కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ అమ్మడు ఇప్పటి వరకు పెళ్లి విషయమై క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు పెళ్లి చేసుకుంటుందా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నయనతార పెళ్లి అదుగో ఇదుగో అంటూ పుకార్లు షికార్లు చేస్తున్న ఈ సమయంలో ఇలా నయన్‌ పెళ్లి కూతురు గెటప్‌ లో ఉన్న ఒక ఫొటో సోషల్‌ మీడియాలో ప్రత్యక్ష్యం అయ్యింది. గతంలో నయన్‌ నటించిన ఒక సినిమా ఆన్‌ లొకేషన్‌ స్టిల్‌ అయ్యి ఉంటుందని కొందరు భావిస్తున్నా మరికొందరు మాత్రం నిజంగా నయన్‌ పెళ్లి ఫొటోలా ఉంది. ఆమె పెళ్లి చేసుకుందా ఏంటీ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

పెళ్లి కూతురుగా నవ్వులు చిందిస్తూ ఉన్న నయన్‌ ఈమద్య కాలంలో ఫొటోలాగే ఉంది. ఇటీవల ఈమె నటించిన అమ్మోరు తల్లిలో ఈ లుక్‌ తోనే కనిపించింది. అంటే ఇదే పర్సనాలిటీ మరియు ఇంకా స్టైల్‌ లో ఆమె కనిపించడం వల్ల ఖచ్చితంగా పెళ్లి కూతురుగానే నయనతార మారి ఉంటుందని అంటున్నారు. అయితే నయనతార విషయంలో పెళ్లి అనేది చాలా చిన్న విషయం. కెరీర్‌ అనేది చాలా పెద్ద విషయం. అందుకే పెళ్లిని పక్కన పెట్టి కెరీర్‌ పై దృష్టి పెట్టి ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ తో సహజీవనం సాగిస్తుంది అంటూ తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు.


Advertisement

Recent Random Post:

Russia : Massive Terror Attack in Moscow

Posted : March 23, 2024 at 2:38 pm IST by ManaTeluguMovies

Russia : Massive Terror Attack in Moscow

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement