Advertisement

ఎన్టీఆర్ సినిమాకూ అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతోన్న త్రివిక్రమ్

Posted : December 30, 2020 at 6:56 pm IST by ManaTeluguMovies

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఏడాది అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు. ఈ విజయంతో త్రివిక్రమ్ మరోసారి తన స్థాయిని చాటుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా కోసం కసరత్తులు చేస్తోన్న విషయం తెల్సిందే.

వీరిద్దరూ కలిసి ఇంతకు ముందు అరవింద సమేత చిత్రంతో విజయం అందుకోవడంతో ఈసారి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రానికి అయినను పోయి రావాలె హస్తినకు, రాజు వచ్చినాడు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.

అలాగే ఈ చిత్రంలో కూడా త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో మెయిన్ హీరోతో పాటు మరో హీరోను కూడా నటింపజేయడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాడు. అలాగే ఎన్టీఆర్ సినిమాకు ఉపేంద్ర కీలక పాత్ర కోసం ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ సన్నాఫ్ సత్యమూర్తి కోసం పనిచేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరోసారి వీరు కలిసి పనిచేయబోతున్నారు. ఎస్ రాధా కృష్ణ, కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు.


Advertisement

Recent Random Post:

RRR : Jr.NTR, Ram Charan, Rajamouli || రణం ముంగిట…. LIVE Updates

Posted : January 20, 2021 at 7:37 pm IST by ManaTeluguMovies

RRR : Jr.NTR, Ram Charan, Rajamouli || రణం ముంగిట…. LIVE Updates

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement