Advertisement

పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీపై మెగా హీరో ఫిల్మ్.!

Posted : October 29, 2020 at 1:11 pm IST by ManaTeluguMovies

‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ లాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే ఎంటర్టైనింగ్ సినిమాతో త్వరలో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి సిద్దమవుతున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ‘సోలో బ్రతుకే సో బెటర్’ కి సంబందించిన అన్ని పనులు పూర్తి చేసిన తేజ్ ప్రస్తుతం దేవకట్టా దర్శకత్వంలో చేయనున్న ఓ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు.

ఇంటెన్స్ ఎక్కువ ఉన్న పాత్రలు రాయడం దేవకట్టా స్పెషలిస్ట్ అందుకే సాయి తేజ్ ఆ పాత్ర విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారని ఇదివరకే తెలిపాం. తాజాగా మేము ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం అదేమిటంటే.. ‘ఈ సినిమాలోని చాలా పొలిటికల్ సన్నివేశాలు నటుడు జనసేనాని పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ నుంచి స్ఫూర్తిగా తీసుకున్నారట. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీలోని ఆసక్తికర సంఘటనలను చూపించనున్నారని’ సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ జర్నీ సీన్స్ సినిమాలో ఒక పార్ట్ ఏ గానీ పూర్తి కథాంశం వేరేలా ఉంటుందని సమాచారం.

ఆ సన్నివేశాలను పవన్ కళ్యాణ్ మేనల్లుడైన తేజ్ పర్ఫెక్ట్ గా చేయాలని ఎక్కువ ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటున్నారు. ‘రిపబ్లిక్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ సినిమాలో సాయి తేజ్ తో నివేత పేతురాజ్ రొమాన్స్ చేయనుంది. జె భగవాన్ – పుల్లారావులు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Krishna District: ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమిలో కుమ్ములాటలు | TDP, BJP & Janasena Alliance |

Posted : April 20, 2024 at 2:16 pm IST by ManaTeluguMovies

Krishna District: ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమిలో కుమ్ములాటలు | TDP, BJP & Janasena Alliance |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement