Advertisement

నిహారిక పెళ్లి కోసం పవన్‌ వారం బ్రేక్‌

Posted : November 18, 2020 at 4:31 pm IST by ManaTeluguMovies

మెగా బ్రదర్‌ నాగబాబు తనయ నిహారిక మరియు చైతన్యల వివాహంకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వరుసగా ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. అతి తక్కువ మందికి మాత్రమే ఆహ్వానం పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఎంగేజ్‌ మెంట్‌ కు హాజరు కాని పవన్‌ కళ్యాణ్‌ పెళ్లికి హాజరు అయ్యే అవకాశం ఉందా అంటూ కొన్ని రోజులుగా మెగా వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ లో ఉన్నాడు. డిసెంబర్‌ 9న రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్‌ లో వివాహం జరగాల్సి ఉంది కనుక పవన్‌ హాజరు అయ్యే విషయమై రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వకీల్‌ సాబ్‌ సినిమా డిసెంబర్‌ లో వారం రోజుల పాటు ఆగిపోనుందట. ఎందుకంటే నిహారిక పెళ్లికి వెళ్లేందుకు పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్‌ కు వారం రోజుల పాటు దూరంగా ఉండబోతున్నారు. ఆ సమయంలో పవన్‌ ఉండని కాంబో సీన్స్‌ ను దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. పెళ్లి కోసం రెండు రోజుల ముందు పవన్‌ అక్కడకు ఫ్యామిలీతో వెళ్తాడనే వార్తలు వస్తున్నాయి. పెళ్లికి పవన్‌ కనీసం మూడు రోజులు కేటాయించే వకాశం ఉంది అంటున్నారు.

నిహారిక ప్రత్యేకంగా పవన్‌ కళ్యాణ్‌ ను ఆహ్వానించిందని అంటున్నారు. పెదనాన్న బాబాయిలు రావాల్సిందే అంటూ పట్టుబడ్డటంతో పాటు వారి నుండి హామీ కూడా తీసుకుంది. చిరంజీవి ఎలాగూ వస్తాడు కాని పవన్‌ విషయమై అనుమానం ఉండటంతో నిహారికకు హామీ ఇచ్చిన కారణంగా పెళ్లికి పవన్‌ వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం సందడి చేయబోతున్న నిహారిక పెళ్లి కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Family Star Teaser – Vijay Deverakonda | Mrunal Thakur | Parasuram | Dil Raju | Gopisundar

Posted : March 22, 2024 at 7:55 pm IST by ManaTeluguMovies

Family Star Teaser – Vijay Deverakonda | Mrunal Thakur | Parasuram | Dil Raju | Gopisundar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement