Advertisement

తనలోని మరో టాలెంట్ ను బయటపెడుతోన్న ప్రియా ప్రకాష్

Posted : January 2, 2021 at 3:23 pm IST by ManaTeluguMovies

నటి ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా? పేరుతో ఐడియా రావట్లేదా? అదేనండీ తన కన్నుగీటుతో దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుందిగా, ఆ భామ. ప్రియా ప్రకాష్ నటించిన ఒరు అదార్ లవ్ చిత్రం ప్లాపైంది. తనకు ఎంతో గుర్తింపు వచ్చినా సినిమా ప్లాప్ అవ్వడంతో ప్రియా ప్రకాష్ కు పెద్దగా అవకాశాలు రాలేదు.

ప్రస్తుతం తెలుగులో ఆమె చేతిలో ఒక సినిమా ఉంది. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తోన్న చెక్ చిత్రంలో ప్రియా ప్రకాష్ సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్.

మరి సినిమాల్లో తగినన్ని ఆఫర్లు రావట్లేదు అనుకుందో, లేక తనలోని కొత్త టాలెంట్ ను బయట పెట్టాలనుకుందో కానీ ఇప్పుడు ప్రియా ప్రకాష్ సింగర్ గా కొత్త అవతారం ఎత్తింది. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల రూపొందిస్తోన్న ఒక ప్రైవేట్ ఆల్బమ్ లో ప్రియా ప్రకాష్ పాడుతోంది. మరి ఈ కొత్త ప్రయాణం ఆమెకు ఎలాంటి గుర్తింపునిస్తుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

Suma Adda Latest Promo – 30th March 2024 – Sruthi,Preethi Nigam,Bhargavi,Sirisha,Lahari,Anjali

Posted : March 28, 2024 at 7:50 pm IST by ManaTeluguMovies

Suma Adda Latest Promo – 30th March 2024 – Sruthi,Preethi Nigam,Bhargavi,Sirisha,Lahari,Anjali

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement