Advertisement

‘గబ్బర్ సింగ్’ దర్శక నిర్మాతలు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు..!

Posted : November 5, 2020 at 7:31 pm IST by ManaTeluguMovies


బ్లాక్ బస్టర్ సినిమా ‘గబ్బర్ సింగ్’ దర్శక నిర్మాతలు హరీష్ శంకర్ – బండ్ల గణేష్ మధ్య ఆ మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ మూవీ విడుదలై 8 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అందరికీ థ్యాంక్స్ చెప్తూ డైరెక్టర్ హరీష్ ఒక లెటర్ విడుదల చేయగా.. అందులో ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పేరు మాత్రం ప్రస్తావించలేదు. అయితే ఆ తర్వాత ఇది గుర్తించిన హరీష్ మరో ట్వీట్ చేస్తూ బండ్లకు కృతజ్ఞతలు తెలిపాడు. బండ్ల గణేష్ దీనికి హార్ట్ అవడమే కాకుండా హరీష్ శంకర్ రీమేక్ సినిమాలను మాత్రమే తీయగలడని.. ఇక జీవితంలో ఆయనతో సినిమాలు తీయనంటూ వ్యాఖ్యలు చేసారు. కొన్ని రోజుల పాటు ఈ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

సినీ ఇండస్ట్రీలో మనస్పర్థలు రావడం.. ఒకరిపై ఒకరు అలగడం.. మళ్ళీ ఒకటవ్వడం అనేది సహజంగా జరిగే విషయాలే. అయితే పబ్లిక్ గా ఒకరినొకరు క్షమాపణలు చెప్పుకునే ఘటనలు మాత్రం అరుదుగా కనిపిస్తుంటాయి. బండ్ల గణేష్ అదే చేశాడు. కరోనా నుంచి కోలుకున్న బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందిస్తూ.. ”అది అన్నదమ్ముల మధ్య అప్పుడప్పుడు వచ్చే చిన్న గొడవ లాంటిది. ఆయన మంచి డైరెక్టర్. అంత పెద్ద డైరెక్టర్ అవకాశం ఇస్తే సినిమా ఎందుకు చేయను. ఆ రోజేదో కోపంలో అలా అనేశాను. అప్పుడప్పుడు ఇంట్లో పిల్లల మీద భార్య మీద కూడా కోప్పడుతుంటా. తల్లి మీద కూడా అలిగి రెండు రోజులు మాట్లాడకుండా ఉంటాం. అన్నదమ్ముల్లాంటోల్లం ఏదో కోపంలో అరుచుకున్నాం. చిన్న చిన్న ఈగోలతో వచ్చిన గొడవ” అని చెప్పుకొచ్చారు. దీనికి హరీష్ స్పందిస్తూ ”నేను ఎప్పుడూ బండ్ల గణేష్ ని గౌరవిస్తాను. గబ్బర్ సింగ్ కోసం మాత్రమే కాదు మిరపకాయ్ కంటే ముందు కూడా నాతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను త్వరగా కోలుకున్నందుకు హ్యాపీ” అని ట్వీట్ చేశాడు.

ఇదిలా ఉండగా బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా మళ్ళీ హరీష్ ని క్షమించమని కోరాడు. ”తెలుగు సినిమా ఇండస్ట్రీలో హరీష్ శంకర్ ఫైనెస్ట్ డైరెక్టర్. సార్.. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే వదిలేయండి. మీతో నేను ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను చేయాలనుకుంటున్నాను” అని బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. దీనికి హరీష్ శంకర్ స్పందిస్తూ ‘సార్ దయచేసి అలా అనకండి. మీరు నా పెద్దన్నయ్య లాంటి వారు. నా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సినిమా మనకంటే చాలా గొప్పది. అందుకే గొప్ప సినిమాలతో మరింత గొప్పగా జీవిద్దాం” అంటూ ట్వీట్ చేశాడు. ఏదేమైనా ‘గబ్బర్ సింగ్’ దర్శక నిర్మాతలు ఇలా పబ్లిక్ గా ఒకరినొకరు క్షమించుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కాగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. అలానే బండ్ల గణేష్ కూడా పవన్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహకాలు చేసుకుంటున్నాడు.


Advertisement

Recent Random Post:

తగ్గేలే లే..🔥🔥 IPL చరిత్రలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ మరో సరికొత్త రికార్డ్ | Sunrisers Hyderabad

Posted : April 16, 2024 at 11:54 am IST by ManaTeluguMovies

తగ్గేలే లే..🔥🔥 IPL చరిత్రలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ మరో సరికొత్త రికార్డ్ | Sunrisers Hyderabad

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement