Advertisement

మరోసారి సీనియర్‌ స్టార్‌ హీరోతో జత కట్టబోతున్న రకుల్‌

Posted : November 19, 2020 at 4:17 pm IST by ManaTeluguMovies

సౌత్‌ లో ముఖ్యంగా తెలుగులో సమంత ప్రాభవం కోల్పోతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ రెండు ఆఫర్లు దక్కించుకుంది. గత రెండు సంవత్సరాలుగా పెద్దగా ఆఫర్లు లేకుండా ఉన్న ఈమెకు ఒకేసారి క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న సినిమాలో మరియు నితిన్‌ హీరోగా నటిస్తున్న చెక్‌ సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అవుతాననే నమ్మకంతో ఈ అమ్మడు ఎదురు చూస్తుంది. ఈ సమయంలోనే ఈ అమ్మడు మరో సినిమాను బాలీవుడ్‌లో చేసే అవకాశం దక్కించుకుంది.

గత ఏడాది అజయ్‌ దేవగన్‌ హీరోగా రూపొందిన దేదే ప్యార్‌ దే సినిమాలో రకుల్‌ నటించింది. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అజయ్‌ మరియు రకుల్‌ మద్య కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈసమయంలోనే ఈ అమ్మడు మరో సినిమాను ఆయనతో చేసేందుకు కమిట్‌ అయ్యింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. మే డే అనే టైటిల్‌ తో రూపొందుతున్న ఈ సినిమాను అజయ్‌ దేవగన్‌ నిర్మించడంతో పాటు హీరోగా నటిస్తున్నాడు. అమితాబచ్చన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

సౌత్‌ లో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాని ఈసమయంలో బాలీవుడ్‌ నుండి వచ్చిన ఈ అవకాశంను ఎంత వరకు ఈ అమ్మడు సద్వినియోగం చేసుకుంటుంది అనేది చూడాలి. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ను వచ్చే నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌లో రకుల్‌ సెటిల్‌ అయ్యేనా చూడాలి.


Advertisement

Recent Random Post:

iSmart News LIVE : కోటలు దాటుతున్న లీడర్ల మాటలు || Theatres open in Telangana

Posted : November 24, 2020 at 10:16 pm IST by ManaTeluguMovies

iSmart News LIVE : కోటలు దాటుతున్న లీడర్ల మాటలు || Theatres open in Telangana

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement