Advertisement

12 కిమీ సైకిల్ తొక్కుంటూ షూటింగ్ కు వెళ్లిన స్టార్ హీరోయిన్

Posted : January 14, 2021 at 8:58 pm IST by ManaTeluguMovies

నేటి తరం హీరో హీరోయిన్లు కాస్త.. ఖాళీ దొరికితే చాలు జిమ్ లో వాలిపోతున్నారు. వీరిలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. వర్కౌట్స్ తో ఎప్పుడూ ఫిట్ గా ఉంటుంది. ఆమె వర్కౌట్లు చేస్తున్న వీడియోలు ఎన్నింటినో ఆమె తన సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈసారి ఏకంగా సైక్లింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఏకంగా 12 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ తాను బాలీవుడ్ లో నటిస్తున్న ‘మేడే’ సినిమా షూటింగ్ కి వెళ్ళింది.

షూటింగ్లకే టైమ్ సరిపోకపోవడంతో ఇలా తన ఫిట్ నెస్ ను కాపాడుకుంటోంది. ‘టైమ్‌ మేనేజ్‌మెంట్‌ ను కాపాడుకుంటూ సెట్స్‌కు 12 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లాను’ అంటూ తన వాల్ లో రాసుకుంది. ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్‌తో ‘మే డే’ సినిమాలో నటిస్తోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అజయ్‌ దేవగణ్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు. తెలుగులో నితిన్‌ తో ‘చెక్‌’ లో కూడా నటిస్తోంది.


Advertisement

Recent Random Post:

సంధ్య ఆక్వా కంపెనీ బస్సుపై సందేహం | Sandhya Aqua Company Documents Found in Bus | CBI | Vizag Drugs

Posted : March 25, 2024 at 1:07 pm IST by ManaTeluguMovies

సంధ్య ఆక్వా కంపెనీ బస్సుపై సందేహం | Sandhya Aqua Company Documents Found in Bus | CBI | Vizag Drugs

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement