Advertisement

ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో తెలిసింది

Posted : January 17, 2021 at 7:38 pm IST by ManaTeluguMovies

యంగ్‌ ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా రూపొందిన రెడ్‌ మూవీ ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా యూనిట్‌ సభ్యులు సక్సెస్ మీట్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది. సినిమా షూటింగ్‌ చేస్తున్నప్పటి నుండే అంచనాలు పెంచారు. ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమా లేదు అంటూ విమర్శలు వచ్చాయి. అయినా కూడా వసూళ్లు మాత్రం బాగానే వస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్‌ లో రామ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ సినిమా కోసం అందరం కష్టపడ్డాం మరియు ఇష్టపడి పని చేశాం. సినిమా విడుదలకు ముందు కాస్త టెన్షన్‌ పడ్డాను. రివ్యూలు ఎలా వస్తాయో ప్రేక్షకుల నుండి స్పందన ఎలా ఉంటుందో అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉంది. మీరంతా మంచి వసూళ్లను ఇచ్చి థ్రిల్‌ చేశారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం దేవదాసు సినిమాతో మీ ముందుకు మొదటి సారి వచ్చాను. మళ్లీ ఈ సంక్రాంతికి రెడ్‌ సినిమాతో నాకు సక్సెస్ ను ఇచ్చారు. ఇండస్ట్రీలో మీకు పోటీ ఎవరు అని నన్ను చాలా సార్లు మీడియా వారు అడుగుతూ ఉంటారు. కాని నాకు పోటీ ఇండస్ట్రీలో వారు కాదు అభిమానులే నాకు పోటీ. మీరు నాపై చూపించే ప్రేమ ఎక్కువనా.. నేను సినిమాపై చూపించే ప్రేమ ఎక్కువనా అనేది ఇద్దరి మద్య పోటీగా ఉందని చెప్పుకొచ్చాడు.


Advertisement

Recent Random Post:

ఏపీలో గెలుపెవరిది..? కేటీఆర్ జోస్యం : KTR Exclusive Interview | Cross Fire | Ram With Rajini

Posted : April 13, 2024 at 12:25 pm IST by ManaTeluguMovies

ఏపీలో గెలుపెవరిది..? కేటీఆర్ జోస్యం : KTR Exclusive Interview | Cross Fire | Ram With Rajini

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement