Advertisement

మాస్ మహారాజా సినిమాలో రామ్ గోపాల్ వర్మ భామ

Posted : October 15, 2020 at 11:18 pm IST by ManaTeluguMovies

ఈ లాక్ డౌన్ సమయంలో రామ్ గోపాల్ వర్మ చేసినంత రచ్చ బహుశా ఇంకెవరూ చేసుండరేమో. షూటింగులు అన్నీ నిలిచిపోయినా కానీ వర్మ మాత్రం ఒక సినిమా తర్వాత ఇంకొకటి అన్నట్లుగా తీస్తూనే వచ్చాడు. ఈ సందర్భంగా బోల్డ్ భామగా అప్సరా రాణిని ఆడియన్స్ కు పరిచయం చేసాడు. తన బోల్డ్ నెస్ తో హాట్ షో తో అప్సరా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం అప్సరా, నైనా గంగూలీలతో వర్మ తీసిన లెస్బియన్ సినిమా డేంజరస్ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అప్సరా రాణికు బంపర్ ఆఫర్ తగిలినట్లుగా తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే షూటింగ్ తిరిగి మొదలైంది.

తాజా సమాచారం ప్రకారం క్రాక్ సినిమాలో అప్సరా రాణి ఒక మాస్ ఐటెం నంబర్ కు ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే థమన్ ఈ మాస్ ఐటెం నెంబర్ రికార్డింగ్ ను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే అప్సరా కెరీర్ భారీ టర్న్ తీసుకోవడం ఖాయం. రవితేజ, అప్సరా మధ్య ఈ ఐటెం నెంబర్ ను త్వరలో షూట్ చేస్తారని అంటున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందన్న విషయం తెల్సిందే.


Advertisement

Recent Random Post:

Alitho Saradaga Latest Promo | Season-2 | Murali Mohan (Actor) | 2nd April 2024

Posted : March 27, 2024 at 5:13 pm IST by ManaTeluguMovies

Alitho Saradaga Latest Promo | Season-2 | Murali Mohan (Actor) | 2nd April 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement