Advertisement

అలా.. సినిమాల్లో చేయలేక వెబ్ సిరీస్ లో చేశా – సమంత

Posted : November 16, 2020 at 8:27 pm IST by ManaTeluguMovies

సమంత.. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ఆమె కెరీర్లో ఫ్లాపుల పర్సంటేజీ చాలా తక్కువ. అంతటి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తోంది. పెళ్లయ్యాక చేసిన రంగస్థలం ఏకంగా నాన్ బాహుబలి హిట్ సాధించింది. వెబ్ సిరీస్ లతోపాటు ఇటివల ఆహా ఓటీటీ కోసం టాక్ షో కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది వెబ్ సిరీస్ ల్లో ‘ది ఫ్యామిలీ మేన్’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా `ది ఫ్యామిలీ మేన్-2` రెడీ అయింది. అయితే.. ఈ సిరీస్ లో సమంత నటించింది. దీని గురించి ఆసక్తికరమైన న్యూస్ చెప్పింది.

‘కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే కొన్నిసార్లు సినిమా మాధ్యమం సరిపోదు. అటువంటి సమయంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ సరిగ్గా ఉపయోగపడుతుంది. నా కెరీర్లో వైవిధ్య చూపేందుకు ఓటీటీ ఉపయోగపడింది. సినిమాల్లో చేయలేని పాత్రను వెబ్ సిరీస్ లో చేసి రూల్స్ బ్రేక్ చేశాను. నన్ను చూస్తే మీరంతా షాక్ అవుతారు’ అని చెప్పుకొచ్చింది. సమంత ఈ సిరీస్ లో పూర్తిగా నెగటివ్ క్యారెక్టర్ లో కనిపించనుందని తెలుస్తోంది. ఈ సిరీస్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చింది.

ది ఫ్యామిలీ మేన్ తొలి సిరీస్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌ అయింది. దీనికి సీక్వెల్ గా తెరకెక్కిన సీజన్ 2 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోందని తెలుస్తోంది. ఇందులో సమంత టెర్రరిస్టుగా నటించిందని వార్తలు వస్తున్నాయి. ఈమేరకు ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశేషాలను వెల్లడించింది.


Advertisement

Recent Random Post:

4:30 PM | ETV Telugu News | 18th Nov 2020

Posted : November 18, 2020 at 5:51 pm IST by ManaTeluguMovies

4:30 PM | ETV Telugu News | 18th Nov 2020

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement