Advertisement

స్టంట్స్ విషయంలో రాజీ అక్కర్లేదన్న సంజు భాయ్‌

Posted : December 31, 2020 at 4:32 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్‌ స్టార్ నటుడు సంజయ్ ధత్‌ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరిపేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్‌ సిద్దం అవుతున్నాడు. ఇటీవలే క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంజయ్ దత్‌ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో పాటు స్టంట్స్ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రశాంత్ నీల్ భావించాడట. అందుకోసం స్టంట్స్ లో కూడా మార్పులు చేర్పులు చేశారనే వార్తలు వస్తున్నాయి.

ఇటీవల సంజయ్‌ దత్‌ స్వయంగా మాట్లాడుతూ ప్రశాంత్ నీల్‌ తో స్టంట్స్ లో ఎలాంటి మార్పులు చేయవద్దు. మొదట ఎలా అయితే అనుకున్నారో అలానే చేద్దాం. నేను పూర్తి ఫిట్ గా ఉన్నాను. ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా నాకు అక్కర్లేదు. నేను పోరాడేందుకు సిద్దంగా ఉన్నాను అని చెప్పాడట. దాంతో దర్శకుడు ముందుగా అనుకున్న ప్రకారమే స్టంట్స్ ను ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.


Advertisement

Recent Random Post:

Congress MP Revanth Reddy Slams PM Modi, CM KCR Over New Farm Laws

Posted : January 19, 2021 at 7:35 pm IST by ManaTeluguMovies

Congress MP Revanth Reddy Slams PM Modi, CM KCR Over New Farm Laws

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement