Advertisement

మళ్లీ బాలీవుడ్‌ పై ఫోకస్‌

Posted : January 6, 2021 at 3:51 pm IST by ManaTeluguMovies

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ కూతురుగా శృతి హాసన్‌ బాలీవుడ్‌ లో పరిచయం అయ్యింది. అతి తక్కువ సమయంలోనే తండ్రి నీడలో నుండి బయటకు రావడంలో ఆమె సక్సెస్ అయ్యింది. ఎప్పుడు కూడా తండ్రి పేరుతో ఆమె ఆఫర్లు దక్కించుకున్న సందర్బాలు లేవు. మల్టీ ట్యాలెంటెడ్‌ అంటూ పేరు దక్కించుకున్న శృతి హాసన్‌ తెలుగు, తమిళం, హిందీలో వరుసగా సినిమాలు చేసింది. ఆమద్య ఏడాదిన్నర పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. మళ్లీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈమె సంక్రాంతికి క్రాక్‌ సినిమా తో సమ్మర్‌ లో వకీల్‌ సాబ్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ రెండు సినిమాల తర్వాత ఈ అమ్మడు కొత్త సినిమాలకు కమిట్‌ అవ్వలేదు. శృతి హాసన్‌ దృష్టి ఇప్పుడు బాలీవుడ్‌ పై పడ్డట్లుగా తెలుస్తోంది. రెండేళ్ల ముందు వరకు ఈ అమ్మడు వరుసగా బాలీవుడ్‌ సినిమాలు చేసింది. గ్యాప్‌ ఇవ్వడం వల్ల ఈమెకు ఆఫర్లు తగ్గాయి. ముంబయిలో సెటిల్‌ అయ్యి అక్కడ వరుసగా సినిమాలు చేయాలని ఆశ పడుతుంది. ఈ ఏడాది అక్కడ కనీసం మూడు నాలుగు సినిమాలకు అయినా కమిట్‌ అవ్వాలనేది ఈమె ప్రయత్నంగా సన్నిహితులు చెబుతున్నారు. అందుకే సౌత్‌ నుండి వస్తున్న ఆఫర్లను పక్కన పెట్టేస్తుందని అంటున్నారు.


Advertisement

Recent Random Post:

బీఆర్ఎస్‌కు కడియం శ్రీహరి, కావ్య గుడ్‌బై

Posted : March 29, 2024 at 11:46 am IST by ManaTeluguMovies

బీఆర్ఎస్‌కు కడియం శ్రీహరి, కావ్య గుడ్‌బై

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement