Advertisement

కొత్త యాంగిల్ చూపించిన సింగర్ ఉష

Posted : April 27, 2020 at 7:59 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్‌లో స్టార్ యాక్టర్లతో పాటు సింగర్లకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. దశాబ్దం క్రితమే యూత్‌లో అలాంటి క్రేజ్ తెచ్చుకున్న లేడీ సింగర్లలో ఉషా ఒకరు. మ్యూజిక్ మస్ట్రో ఇళయరాజా నుంచి దేవిశ్రీప్రసాద్ దాకా ఎంతో మంది సంగీత దర్శకుల దగ్గర పాటలు పాడిన ఉష.. ముందుగా ఆర్.పి.పట్నాయక్ సినిమాలతో సూపర్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఉష పాటలు లేని సినిమాలు ఉండేవి కావంటే అతిశయోక్తి కాదు. అయితే యంగ్ సింగర్ల రాకతో కొన్నేళ్లుగా తెలుగు సినిమా పాటలకు దూరంగా ఉంటోందీ సింగర్.

అయితే ఫ్యాన్స్ మాత్రం ఆమెను మరిచిపోలేదు. టీవీల్లో ఆమె పాడిన క్లాసిక్ సాంగ్స్ వినిపించినప్పుడల్లా ఉషా గాత్రంలోని స్వర మాధుర్యాన్ని తలుచుకుంటూనే ఉన్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా ద్వారా తనలోని మరో టాలెంట్‌ను పరిచయం చేసింది ఉషా.

Weekend fun during Corona times

Weekend fun during Corona times. Sahasra & I shaking a leg ?#StayHome #StayHomeStaySafe

Posted by Singer Usha on Sunday, April 26, 2020

కూతురు సహస్రతో కలిసి బాలీవుడ్ మూవీ ‘బరెల్లీ కి బర్ఫీ’ లోని ‘బరెలీ వాలె జుంకే పే జియా లాల్‌చాయే’ అంటూ సాగే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది ఉషా. ‘వీకెండ్ ఫన్ విత్ కరోనా టైమ్స్’ అంటూ ఈ డ్యాన్సింగ్ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది ఉషా. ఎన్నో అద్భుతమైన పాటలకు తన గొంతుతో ప్రాణం పోసిన సింగర్ ఉషాలో ఇంత టాలెంట్ దాగి ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.

ఎక్కడా సింక్ తప్పకుండా పర్ఫెక్ట్ స్టెప్పులతో డ్యాన్స్ చేసిన సింగర్ ఉషాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు ఆమె ఫ్యాన్స్. సింగర్‌గా సరైన అవకాశాలు రాక, ఇండస్ట్రీకి దూరమైన ఉషా… ఇప్పుడు కొరియోగ్రాఫర్‌గా గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వొచ్చని కామెంట్ చేస్తున్నారు. ‘నువ్వు లేక నేను లేను’, ‘జయం’, ‘సంతోషం’, ‘నీ స్నేహం’, ‘ఔనన్న కాదన్న’, ‘మనసంతా నువ్వే’, ‘నువ్వు నేను’, ‘చిత్రం’, ‘భద్ర’, ‘వర్షం’, ‘అతిథి’, ‘చిరుత’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడిన ఉషా, తెలుగులో చివరగా చార్మి ‘మనోరమ’ చిత్రంలో పాటలు పాడింది.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 19th April 2024

Posted : April 19, 2024 at 10:09 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 19th April 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement