Advertisement

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్త దానం చేసిన సోహైల్, మెహబూబ్

Posted : December 30, 2020 at 10:11 pm IST by ManaTeluguMovies

బిగ్ బాస్ 4 ను సరిగ్గా ఉపయోగించుకుంది అంటే విన్నర్ అభిజీత్ కన్నా సోహైల్ అనే చెప్పాలేమో. 25 లక్షల రూపాయలను తీసుకుని బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అభిజీత్ కు సగానికి సగం ప్రైజ్ మనీను కట్ చేయడంలో విజయవంతమయ్యాడు.

ఇక హౌజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా సోహైల్ రచ్చ మాములుగా ఉండట్లేదు. మెహబూబ్ తో కలిసి పలు ఇంటర్వ్యూలలో కనిపించాడు. ఇక రీసెంట్ గా సోహైల్, మెహబూబ్ ఇద్దరూ కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తం దానమిచ్చారు. మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి తిరిగి ఇలా ఏదొక విధంగా తిరిగి ఇవ్వడం సంతోషాన్నిస్తోంది అని మెహబూబ్ అభిప్రాయపడ్డాడు.

బిగ్ బాస్ ఫినాలే రోజున మెగాస్టార్ ఈ ఇద్దరి మీద ప్రశంసలు, వరాల జల్లు కురిపించిన విషయం తెల్సిందే. మెహబూబ్ కు 10 లక్షల చెక్, సోహైల్ కు ప్రైజ్ మనీ, తన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తానని చెప్పడం, మటన్ బిర్యానీ ఇలా వరాలతో ముంచెత్తాడు. ఇప్పుడు మరోసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు రక్తం దానం చేసి మార్కులు కొట్టేసారు.


Advertisement

Recent Random Post:

జగన్ గెలుపుని తన బాధ్యతగా ప్రచార పర్వంలోకి భారతి l YS Bharathi Reddy l CM Jagan l

Posted : April 12, 2024 at 9:15 pm IST by ManaTeluguMovies

జగన్ గెలుపుని తన బాధ్యతగా ప్రచార పర్వంలోకి భారతి l YS Bharathi Reddy l CM Jagan l

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement