Advertisement

వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైం వచ్చేసిందోచ్.!

Posted : January 7, 2021 at 7:37 pm IST by ManaTeluguMovies

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా తన రీఎంట్రీ చిత్రం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మార్చ్ లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక వకీల్ సాబ్ టీజర్ సంక్రాంతికి విడుదలవుతుందని ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు.

ఇప్పుడు వకీల్ సాబ్ టీజర్ ఎప్పుడు విడుదలవుతుంది అన్నదానిపై క్లారిటీ వచ్చింది. జనవరి 14న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు టీజర్ విడుదలవుతుంది. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాట సూపర్ హిట్ అయింది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెల్సిందే.


Advertisement

Recent Random Post:

Muslim Woman Raises Funds For Ram Mandir Donations

Posted : January 22, 2021 at 6:45 pm IST by ManaTeluguMovies

Muslim Woman Raises Funds For Ram Mandir Donations

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement