Advertisement

వకీల్‌ సాబ్‌ సంక్రాంతి రిలీజ్ సస్పెన్స్‌ పై శృతి హాసన్‌ క్లారిటీ

Posted : November 25, 2020 at 7:11 pm IST by ManaTeluguMovies

పవన్‌ కళ్యాణ్‌ 26వ సినిమా వకీల్‌ సాబ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోతున్న సంక్రాంతికి పవన్‌ సినిమా వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు పవన్‌ నుండి సినిమా వచ్చిందే లేదు. అందుకే అభిమానులు వకీల్‌ సాబ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా బాలీవుడ్‌ హిట్‌ మూవీ పింక్‌ కు రీమేక్ అనే విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించి కాస్త కమర్షియల్‌ టచ్‌ ఇచ్చి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో పవన్‌ కు జోడీగా శృతి హాసన్‌ నటించబోతుంది. శృతి హాసన్‌ ఒక పాట మరియు రెండు మూడు సీన్స్‌ లో మాత్రమే కనిపించబోతుంది. కేవలం రెండు వారాలు మాత్రమే ఈ సినిమా కోసం ఆమె పని చేయబోతుంది. ఆమె వకీల్‌ సాబ్‌ షూటింగ్‌ లో అదుగో ఇదుగో అంటూ ప్రచారం జరిగింది. కాని తాజాగా ఒక చిట్‌ చాట్ లో శృతి హాసన్‌ మాట్లాడుతూ నేను జనవరిలో పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ లో పాల్గొనాల్సి ఉందని చెప్పుకొచ్చింది.

సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల అవుతుందని అంతా భావించారు. కాని షూటింగ్‌ మాత్రం జనవరి వరకు ఉందంటూ శృతి హాసన్‌ మాటలతో క్లారిటీ రావడంతో సంక్రాంతికి సినిమా విడుదల ఖచ్చింగా లేదు అనే క్లారిటీ వచ్చేసింది. ఎలాగూ మార్చిలో పరీక్షలు ఉండవు కనుక సినిమాను అప్పుడే విడుదల చేయాలని భావిస్తున్నారు. అప్పటి వరకు వైరస్‌ ప్రభావం కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వకీల్‌ సాబ్‌ అభిమానులు కాస్త వెయిట్ చేయాల్సిందే అంటూ శృతి ఇండైరెక్ట్‌ గా చెప్పేసింది.


Advertisement

Recent Random Post:

రసవత్తరంగా మారుతున్న ఏపీ రాజకీయాలు | Political Heat AP | AP Elections 2024

Posted : April 22, 2024 at 12:12 pm IST by ManaTeluguMovies

రసవత్తరంగా మారుతున్న ఏపీ రాజకీయాలు | Political Heat AP | AP Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement