Advertisement

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

Posted : June 1, 2020 at 8:40 pm IST by ManaTeluguMovies

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ అంటూ భారీ మల్టీస్టారర్‌ చేస్తుండగా ఆ చిత్రం తర్వాత మరిన్ని మల్టీస్టారర్‌ చిత్రాలు వస్తాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి మరియు మలయాళ స్టార్‌ హీరో ఫాహద్‌ ఫాజిల్‌లు తెలుగు మల్టీస్టారర్‌ను చేయబోతున్నారట.

వీరిద్దరు కూడా ఎవరికి వారే చాలా ప్రత్యేకమైన నటులు. ఇద్దరు కూడా విలక్షణ పాత్రలు పోషిస్తూ గుర్తింపు దక్కించుకున్నారు. విజయ్‌ సేతుపతి ఇప్పటికే తెలుగులో ఆకట్టుకోగా ఫాహద్‌ ఫాజిల్‌ మాత్రం తెలుగు ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమద్య విలన్‌ పాత్రకు గాను ఒక డైరెక్టర్‌ సంప్రదించగా నో అన్నాడట. తాజాగా తెలుగులో ఒక సినిమాను చేసేందుకు అది కూడా విజయ్‌ సేతుపతితో కలిసి చేసేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

రాజు కనుకుల వీరిద్దరికి ఒక కథ చెప్పి ఒప్పించడం జరిగింది. ఆ సినిమా ఈ కరోనా కల్లోలం సర్దుమనిగిన తర్వాత ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇద్దరు హీరోలు కూడా కథ విషయంలో చాలా ఇంట్రెస్ట్‌ను చూపించారట. ఇద్దరికి వారి పాత్రలు నచ్చడంతో పాటు కథ నచ్చడంతో ఎప్పుడెప్పుడు చేద్దామా అన్నట్లుగా ఉన్నారట. తెలుగులో ఈ మల్టీస్టారర్‌ తెరకెక్కించి పాన్‌ ఇండియా లెవల్‌ లో విడుదల చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


Advertisement

Recent Random Post:

అర్చకులపై వైసీపీ నేత దాడి | YCP leader Attack on Priests | Kakinada

Posted : March 26, 2024 at 9:42 pm IST by ManaTeluguMovies

అర్చకులపై వైసీపీ నేత దాడి | YCP leader Attack on Priests | Kakinada

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement