Advertisement

ఆమిర్‌కు రాసిచ్చేస్తే రాజమౌళి ఏం కావాలి?

Posted : June 14, 2020 at 9:33 pm IST by ManaTeluguMovies

దర్శక ధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు ఏంటన్నది అందరికీ తెలుసు. ఎప్పటికైనా ‘మహాభారతం’ కథను తనదైన శైలిలో భారీగా తెరకెక్కించాలన్నది జక్కన్న కల. ఈ సంగతి ఐదేళ్ల కిందటే చెప్పాడు. ఆ సినిమా తీయడానికి పదేళ్లు పడుతుందన్నాడు. జక్కన్న చెబుతున్న స్థాయిలోఈ సినిమా చేయాలంటే.. కొన్నేళ్ల ముందు నుంచే సన్నాహాలు మొదలుపెట్టాల్సి ఉంటుంది.

తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో రాజమౌళి ఇప్పటికే స్క్రిప్టు చర్చలు మొదలుపెట్టే ఉంటాడని అంతా అనుకుంటున్నారు. లాక్ డౌన్ టైంలో ఆ పని మొదలై ఉంటుందని కూడా చర్చించుకుంటున్నారు.

ఐతే విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఇప్పుడు రాజమౌళి అభిమానులకు షాకిచ్చే న్యూస్ చెప్పాడు. తాను ఆమిర్ ఖాన్ తెరకెక్కించాలనుకుంటున్న మహాభారతం కోసం స్క్రిప్టు రాసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపాడు.

ఓ ఇంగ్లిష్ డైలీతో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించాడు. మహాభారతం మీద ఆమిర్ ఖాన్ ఒక సిరీస్ చేయాలనుకుంటున్నట్లు కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తరహాలో ఆయన టీవీ సిరీస్ చేస్తాడని అంటున్నారు. స్వయంగా ఇందుకోసం మహాభారతం మీద ఆమిర్ పరిశోధన జరిపాడు.

ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ లాంటి దిగ్గజ రచయిత సహకారం కోరుతున్నాడు. తమ మధ్య చర్చలు ఆరంభ దశలోనే ఉన్నాయని విజయేంద్ర చెప్పాడు కానీ.. ఆమిర్ అడిగితే నో అనకుండా చర్చలు జరుపుతున్నారంటే దీనికి స్క్రిప్టు రాసే ఉద్దేశం ఉన్నట్లే అనమాట. మరి ఆమిర్‌కు మహాభారతంపై తన వెర్షన్ రాసి ఇచ్చేస్తే.. తర్వాత రాజమౌళికి విజయేంద్ర ఏం రాస్తాడన్నది ప్రశ్న.

మహాభారంత వ్యాస్ట్ సబ్జెక్టే. అందులో ఎవరికి ఆసక్తి ఉన్న ఉపకథల్ని వాళ్లు తీసుకోవచ్చు. రకరకాల వెర్షన్లలో కథను చెప్పొచ్చు. కానీ మూల కథ, అందరికీ తెలిసిన, కనెక్టయ్యే కాన్సెప్ట్‌లు కొన్ని ఉంటాయి. వాటి దగ్గర క్లాష్ రావచ్చు. మరి ఆమిర్‌కు ఒక అడాప్షన్ రాసిచ్చి.. తర్వాత జక్కన్న మెచ్చేలా మళ్లీ ‘మహాభారతం’ కథను ఇంకో వెర్షన్ రాసి ఇవ్వగలిగారంటే విజయేంద్ర మామూలు రైటర్ కాదని ఒప్పుకోవాల్సిందే.


Advertisement

Recent Random Post:

Delhi Liquor Scam Case Updates : ఇవాళ్టితో ముగియనున్న కవిత ED కస్టడీ

Posted : March 23, 2024 at 11:55 am IST by ManaTeluguMovies

Delhi Liquor Scam Case Updates : ఇవాళ్టితో ముగియనున్న కవిత ED కస్టడీ

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement