Advertisement

హీరోయిన్‌ కు క్షమాపణ చెప్పాలంటూ యూట్యూబ్‌ ఛానెల్‌ కు హీరో వార్నింగ్‌

Posted : February 24, 2021 at 4:23 pm IST by ManaTeluguMovies

హీరోయిన్ నందితా శ్వేతా కీలక పాత్రలో నటించిన అక్షర సినిమా ప్రమోషన్‌ లో భాగంగా సినిమాలోని ఒక పాటను యంగ్‌ హీరో విశ్వక్ సేన్‌ ఆవిష్కరించిన విషయం తెల్సిందే. ఆ పాట విడుదల సందర్బంగా నందితా హీరో విశ్వక్‌ సేన్‌ కు కృతజ్ఞతలు తెలియజేసింది. ఆ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సినిమా కోసం చాలా కష్టపడ్డట్లుగా చెప్పింది. కాని ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ వారు మాత్రం వీడియో థంబ్‌ నైల్ పై విశ్వక్ నీకు ఏమి కావాలన్నా అడుగు, సిగ్గు లేకుండా ఇచ్చేస్తా అని వ్యాఖ్యలు చేసింది అన్నట్లుగా పెట్టారు.

ఆ థంబ్‌ నైల్‌ టైటిల్ పై విశ్వక్‌ సేన్‌ సీరియస్ అయ్యాడు. మీ ఇంట్లో కూడా ఆడవారు ఉన్న విషయం మీరు ఎందుకు మర్చి పోతున్నారు అంటూ సీరియస్ గా వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ వీడియో ను వెంటనే తొలగించడంతో పాటు 24 గంటల్లో ఆమెకు క్షమాపణ చెబుతూ వీడియో పోస్ట్‌ చేయాలి. లేదంటే ఇంటికి వచ్చి మరీ బుద్ది చెప్తానంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ యూట్యూబ్‌ ఛానెల్‌ తీరుపై విశ్వక్ సేన్‌ అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Shiromundanam Case : Thota Trimurthuluకు 18 నెలల జైలు శిక్ష

Posted : April 16, 2024 at 6:45 pm IST by ManaTeluguMovies

Shiromundanam Case : Thota Trimurthuluకు 18 నెలల జైలు శిక్ష

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement