Advertisement

గాయాలపాలైన వైవా హర్ష… అసలు విషయమేమిటంటే!

Posted : February 18, 2021 at 10:48 pm IST by ManaTeluguMovies

వైవా అనే ఒకే ఒక్క షార్ట్ ఫిల్మ్ తో హర్ష జీవితమే మారిపోయింది. ఆ షార్ట్ ఫిలిం లో హర్ష ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన వైవా హర్షకు సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. వైవా హర్షగానే తన పేరు స్థిరపడిపోయింది.

క్రమంగా సినిమాల్లో సూపర్బ్ అవకాశాలను సంపాదించుకున్నాడు హర్ష. రీసెంట్ గా వచ్చిన కలర్ ఫోటో సినిమా తన కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్లింది. ఆ సినిమాలో కమెడియన్ గా నవ్వించడమే కాకుండా ఏడిపించగలనని కూడా నిరూపించాడు.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో హర్ష ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. తనకు బైక్ రేసింగ్ లు అంటే కూడా చాలా ఇష్టం. రీసెంట్ గా హర్ష హాస్పిటల్ బెడ్ మీద గాయాలతో ఉన్న ఫోటోను షేర్ చేసాడు. అది చూసి అందరూ ఒక్క క్షణం కంగారు పడ్డారు. అయితే ఈలోగా అది సుమంత్ హీరోగా చేస్తోన్న అనగనగా ఓ రౌడీ అనే సినిమాలో స్టిల్ అని తెలియగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Advertisement

Recent Random Post:

Prathinidhi 2 Theatrical Trailer | Nara Rohith | Murthy Devagupthapu | Siree Lella

Posted : April 19, 2024 at 9:07 pm IST by ManaTeluguMovies

Prathinidhi 2 Theatrical Trailer | Nara Rohith | Murthy Devagupthapu | Siree Lella

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement