Advertisement

ఆ అధికారిని వైఎస్‌ జగన్‌ సాగనంపేస్తున్నారట.!

Posted : November 16, 2020 at 1:37 pm IST by ManaTeluguMovies

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన అత్యంత కీలకమైన ఐఏఎస్‌ అధికారి. సీనియర్‌ అధికారి కావడం సహా అనేక కారణాలతో, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆయనకు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చారు. దాంతో, ఆయన ఒకింత ‘డైనమిక్‌’గా వ్యవహరించడం మొదలు పెట్టారు. అయితే, సదరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వ్యవహార శౖలి పట్ల వైసీపీ ఎమ్మెల్యేలే కాదు, ఎంపీలు కూడా తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారట గత కొన్నాళ్ళుగా.

తమ పనులు చక్కబెట్టుకోవడానికి వీలు కాకపోవడంతో ఆయా ప్రజా ప్రతినిథులు సదరు సీనియర్‌ అధికారిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వద్ద తమ గోడు వెల్లగక్కుకున్నారట. సహచర ఐఏఎస్‌ అధికారులు కూడా ఆయన తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారట. అన్నిటికీ మించి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ‘వేటు’ పడటానికి కారణం కూడా సదరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారేనట. ఆయన ఎవరూ కాదు, ప్రవీణ్‌ ప్రకాష్‌ అట. ఇదంతా వైసీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న ప్రచారం.

తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ‘కథ’పై ఉప్పందడంతో సదరు సీనియర్‌ అధికారి, వేటు పడక ముందే తేరుకోవాలన్న కోణంలో, తనను కేంద్ర సర్వీసులకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని కోరారట. అలా కోరిందే తడవు, ప్రవీణ్‌ ప్రకాష్‌ బదిలీకి సానుకూలత తెలిపారట ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ఇదంతా వైసీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న ప్రచారం తాలూకు సారాంశం.

గతంలో టీడీపీ అనుకూల మీడియా ఈ తరహా కథనాల్ని తెరపైకి తెచ్చేది. ఆ మాటకొస్తే, టీడీపీ హయాంలో.. ఈ తరహా రాజకీయం కొత్తేమీ కాదు. అచ్చంగా, అదే బాటలో వైసీపీ కూడా నడుస్తున్నట్లుంది. ఎవరికి పొగ పెట్టాలో వారిపై, తమ అను‘కుల’ మీడియాతో ప్రచారం చేయించి, ‘ఇలా అనుకుంటున్నారు.. అలా అనుకుంటున్నారు..’ అని చెప్పించి, బురద చల్లేసి.. సాగనంపేయడం ఈ ‘కుల’ మీడియాకి అలవాటుగా మారిపోయింది.

మరి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాష్‌ విషయంలో వైసీపీ అనకూల మీడియా ప్రచారం నిజమేనా.? పేరు పెట్టి మరీ తన మీద దుష్ప్రచారం షురూ చేసిన సదరు వైసీపీ అను‘కుల’ మీడియాపై సదరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎలాంటి చర్యలు తీసుకుంటారు.? ఏమో, వేచి చూడాల్సిందే.


Advertisement

Recent Random Post:

Chhattisgarh లో భారీ ఎన్‌కౌంటర్.. అగ్ర నేతలతో సహా 29 మంది దుర్మరణం

Posted : April 17, 2024 at 11:49 am IST by ManaTeluguMovies

Chhattisgarh లో భారీ ఎన్‌కౌంటర్.. అగ్ర నేతలతో సహా 29 మంది దుర్మరణం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement