Advertisement

అఖిరా – అయాన్ – సితార.. ఒకే హీరో!

Posted : November 6, 2024 at 2:37 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ లో నెక్స్ట్ జెనరేషన్ స్టార్స్ గా అప్పుడే అభిమానుల నుంచి ఆదరణ పొందుతున్న వారిలో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ఉన్నారు. అతని డెబ్యూ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ తనయుడు అయాన్ కూడా భవిష్యత్తులో తండ్రి వారసత్వం అందుకుంటాడని బన్నీ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార అప్పుడే తన యాక్టింగ్, సింగింగ్ టాలెంట్ ని చూపిస్తూ ఉంది.

సోషల్ మీడియాలో కూడా సితార యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే అల్లు అయాన్ అభిమాన హీరో డార్లింగ్ ప్రభాస్ అనే మాట వినిపిస్తోంది. అన్ స్టాపబుల్ షోలో అయాన్ ఈ విషయాన్ని చెప్పినట్లు టాక్ నడుస్తోంది. మరో వైపు అకిరా నందన్ కి బాగా ఇష్టమైన హీరో అంటే డార్లింగ్ ప్రభాస్ అని సమాచారం. ప్రభాస్ సినిమాలు మిస్ అవ్వకుండా అకిరా నందన్ చూస్తాడంట. కల్కి టైమ్ లో కూడా స్పెషల్ షోను చూసిన వీడియో వైరల్ అయ్యింది. అలాగే మహేష్ బాబు కూతురు సితార ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే ఒకే ఒక్క స్టార్ హీరో ప్రభాస్ అని తెలుస్తోంది.

వీరు మాత్రమే కాకుండా చాలా మంది స్టార్ కిడ్స్ కి ప్రభాస్ అభిమాన హీరో అని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ప్రభాస్ ఫ్రెండ్లీ నేచర్ ని పిల్లలు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఆయన స్టైల్, ఆటిట్యూడ్ కూడా పిల్లలని ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే పిల్లలు ఎక్కువగా ప్రభాస్ ని అభిమానిస్తారు. ఇదిలా ఉంటే డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ మూవీ షూటింగ్ లో ఉన్నారు. ఈ మూవీ 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది.

దీని తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత ప్రభాస్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ షూటింగ్ ప్రభాస్ బర్త్ డే నాడు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వీటిని కంప్లీట్ చేసి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తారు.

వాటి తర్వాత ‘కల్కి 2898ఏడీ’ మూవీ షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. మరో వైపు ప్రశాంత్ వర్మ ప్రభాస్ కి కథ చెప్పాడనే టాక్ వినిపిస్తోంది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాలు మూడేళ్ళ తర్వాత మొదలయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు.


Advertisement

Recent Random Post:

Deputy CM Pawan Kalyan Kadapa Tour LIVE | విద్యార్థులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి

Posted : December 7, 2024 at 11:46 am IST by ManaTeluguMovies

Deputy CM Pawan Kalyan Kadapa Tour LIVE | విద్యార్థులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad