Advertisement

అమితాబ్ మనవరాలితో ప్రేమాయణంపై ఓపెనయ్యాడు

Posted : November 5, 2022 at 10:30 pm IST by ManaTeluguMovies

బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యనవేళి నందాతో యువహీరో సిద్ధాంత్ చతుర్వేది ప్రేమలో ఉన్నాడని చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. గల్లీ బోయ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలో అద్భుత పాత్రతో ఆకట్టుకున్న సిద్ధాంత్ బాలీవుడ్ ట్రెండీ హీరోల్లో ఒకడిగా వెలిగిపోతున్నాడు. కెరీర్ పరంగా వెనుదిరిగి చూడాల్సిన పనే లేనంత బిజీగా ఉన్నాడు. అతడికి హీరోగా మంచి భవిష్యత్ ఉందని తన ప్రతిభ నిరూపిస్తోంది.

అయితే అతడు అమితాబ్ కూతురు శ్వేత నందా వారసురాలైన నవ్య నవేలి నందాతో డేటింగ్ చేస్తున్నాడన్నది ఇటీవల సంచలన వార్తగా మారుతోంది. తాజాగా ఈ రూమర్స్ గురించి అతడు ఓపెనయ్యాడు
సిద్ధాంత్ చతుర్వేది ప్రస్తుతం సహనటులు కత్రినా కైఫ్ – ఇషాన్ ఖట్టర్ లతో కలిసి ఫోన్భూత్ మూవీ ప్రమోషన్ లో ఉన్నాడు. ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన పుకార్లను అతడు ప్రస్తావించారు.

నిజానికి నవ్య నవేలి నందా ఇతర నటవారసురాళ్ల తరహాలో ఆలోచించడం లేదు. తను ఇంకా సినిమాల్లోకి నటిగా ప్రవేశించలేదు. కానీ అందాల స్టార్ కిడ్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటోంది. అయితే ఆమె డేటింగ్ చేస్తోంది ట్యాలెంటెడ్ సిద్ధాంత్ చతుర్వేదితో అంటూ సాగుతున్న ప్రచారంపై ఇప్పటివరకూ స్పందించింది లేదు.

ఆ ఇద్దరూ మీడియాలో డేటింగ్ వ్యవహారం గురించి ఇప్పటివరకూ ప్రస్తావించలేదు. ఒకవేళ ప్రశ్న ఎదురైనా కానీ.. ఇద్దరూ తరచుగా ఒకరితో ఒకరు కలుసుకోవడం రొటీన్ గానే జరుగుతుందని అభిమానులకు హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఫోన్ బూత్ కోసం తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్న సిద్ధాంత్ తనదైన శైలిలో ఈ వార్తలపై గుంభనగా మాట్లాడాడు. అటు ఔను అని అనలేదు. ఇటు కాదు అని కూడా క్లూ ఇవ్వలేదు. చాలా తెలివిగా మాటను దాటవేసాడు.

తాజా ఇంటర్వ్యూలో సిద్ధాంత్ చతుర్వేదిని డేటింగ్ పై తాజా పుకార్లు నిజమేనా? అని ప్రశ్నించగా….దానికి స్పందిస్తూ… “నేను డేటింగ్ చేస్తున్నాను.. ఒకరిని ఎంపిక చేసుకున్నాను.. తననే చూస్తున్నాను. అది నిజమవ్వాలని నేను కోరుకుంటున్నాను…“ అంటూ ఉత్కంఠ పెంచాడు. ఆసక్తికరంగా అతడు ఫన్ తో కూడుకున్న సెటైర్ వేసాడు. సిద్ధాంత్ తన స్టేటస్ గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. కత్రినా కైఫ్ -ఇషాన్ ఖట్టర్ సహా ఫోన్ భూత్ తారాగణంతో కాఫీ విత్ కరణ్ లో కనిపించినప్పుడు కూడా అతని రిలేషన్ షిప్ స్టేటస్ గురించి హోస్ట్ KJo అడిగాడు. అతను దానికి సమాధానం ఇచ్చాడు. తాను ఒంటరిగా ఉన్నానని తెలిపాడు. అయితే ఇటీవల అమ్మాయితో తిరగడం ప్రారంభించడంతో ఇషాన్ సింగిల్ అయ్యాడు!! అంటూ తనదైన ఫన్నీ కామెంట్ తో అందరినీ నవ్వించాడు.

గల్లీ బాయ్ తర్వాత ఇటీవలి గెహ్రైయాన్ తో ఫేమ్ సంపాదించిన సిద్ధాంత్ చతుర్వేది ఫోన్ భూత్ లో ఒక రకమైన ఘోస్ట్ బస్టర్ పాత్రలో నటించాడు. ఈ హారర్ కామెడీలో కత్రినా కైఫ్ తొలిసారిగా దెయ్యం పాత్రలో కనిపించింది. జాకీ ష్రాఫ్ ప్రతినాయకుడిగా నటించారు. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మించింది.ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా మిశ్రమ సమీక్షలు దక్కాయి.


Advertisement

Recent Random Post:
Advertisement