చిరంజీవి ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఆయన మదర్ అంజనా దేవి చాలా తక్కువ సమయాల్లో మీడియా ముందుకు వచ్చారు. అసలు అంతకుముందు ఆమె గురించి ఎవరికి పెద్దగా తెలిసేది కాదు. కానీ సోషల్ మీడియా యుగంలో చిరంజీవి తానే స్వయంగా ఇంట్లో జరిగే కొన్ని హ్యాపీ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు. కొడుకు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఒక తల్లి బిడ్డే అనేలా అంజనా దేవి దగ్గరకు వెళ్లగానే చిరు చిన్నపిల్లాడైపోతాడు. చిరు తో పాటుగా నాగ బాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కొడుకులకు అంజనా దేవి చూపించే ప్రేమ వాత్సల్యం ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఐతే సినీ, రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో అటు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి ఎంత ఎంకరేజ్ మెంట్ అందుకున్నారో విమర్శలు కూడా అదే రేంజ్ లో తెచ్చుకున్నారు. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ చాలా కామెంట్స్ చేశారు. ఐతే వీటిపై ఎప్పుడు ఆ ఫ్యామిలీ మాట్లాడలేదు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి మొదటిసారి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజైంది. తల్లి మనసు కదా పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్న టైం లో బాధపడ్డానని చెప్పారు. అంతేకాదు ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాల గురించి ప్రస్తావించినట్టు ఉన్నారు. అమ్మ మనసు అంటూ కొణిదెల అంజనా దేవి స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో లేటెస్ట్ గా రిలీజైంది. ఈ ఇంటర్వ్యూతో కొడుల గురించి.. వారి సక్సెస్ ల గురించి అంజనాదేవి ఏం చెబుతారు అన్నది మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.
అమ్మ మనసు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ అంజనా దేవి జనసేన పార్టీ అధికార యూట్యూబ్ ఛానెల్ లో రిలీజ్ అవబోతుందని తెలుస్తుంది. చూస్తుంటే ఈ ఇంటర్వ్యూలో రాజకీయ పరమైన విషయాల గురించి అంజనాదేవి ఘాటుగానే స్పందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి అమ్మ మనసు ఇంటర్వ్యూ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ ఇంటర్వ్యూ కచ్చితంగా మెగా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు. చిరు, పవన్, నాగ బాబుతో పాటు చరణ్ గురించి కూడా అంజనాదేవి ఏం చెప్పబోతారన్నది మెగా ఫ్యాన్స్ అంతా ఎగ్జైట్ గా ఉన్నారు.