ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అల్లు అర్జున్‌కి ఊరట, తప్పు లేదన్న కోర్టు

అల్లు అర్జున్‌ ఏపీలో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు తెలిపేందుకు గాను నంద్యాలకు వెళ్లడం జరిగింది. ఎన్నికలు జరిగే సమయంలో కోడ్‌ ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి జన సమూహం ఏర్పడాలన్నా అనుమతులు తప్పనిసరి. శిల్పా రవి చంద్రారెడ్డికి మద్దతు తెలియజేసేందుకు గాను నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ ముందస్తు అనుమతులు తీసుకోలేదు. పైగా అల్లు అర్జున్‌ ను చూసేందుకు భారీ ఎత్తున జనాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ముందు ఈ వివాదం చాలా పెద్దది అయింది. ఎన్నికల ఫలితాల తర్వాత కేసు కోర్టుకు చేరింది.

ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించిన కేసులో అల్లు అర్జున్‌ను దోషిగా తేల్చాల్సిందిగా కోర్టులో పోలీసులు వాదనలు వినిపించడం జరిగింది. అయితే అల్లు అర్జున్‌ తరపు లాయర్‌లు మాత్రం ఏపీ హై కోర్టులో ఈ కేసును కొట్టి వేయాలంటూ వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం అక్కడకి వెళ్లారు. అంతే తప్ప ప్రత్యేకంగా ఒక పార్టీకి కానీ, ఒక అభ్యర్థికి కానీ ప్రచారం చేయడంకు అక్కడకి వెళ్లలేదు అంటూ అల్లు అర్జున్‌ తరపు లాయర్‌లు వాదనలు వినిపించడంతో పాటు కొన్ని సాక్ష్యాలను సైతం కోర్టుకు సమర్పించారని తెలుస్తోంది. దాంతో బన్నీ తరపు లాయర్‌ల వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ కేసు నుంచి అల్లు అర్జున్‌ ను తప్పిస్తున్నట్లుగా ప్రకటించింది.

అల్లు అర్జున్‌ నంద్యాల పర్యటన వ్యక్తిగతం కనుక కోడ్‌ ఉల్లంఘన కిందకు రాదని, అల్లు అర్జున్‌ పై నమోదు అయిన కేసును క్వాష్ చేయాలని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని, శిక్ష కు సైతం అల్లు అర్జున్‌ అర్హుడు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ బన్నీ తరపు న్యాయవాదులు బలంగా తమ వాదనలు వినిపించడం ద్వారా కేసును క్వాష్‌ చేయడం జరిగింది. అల్లు అర్జున్‌ ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారం కు వెళ్లలేదని, ఆయన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన సమయంలో అభిమానులు అక్కడ గుమ్మిగూడటం జరిగిందని లాయర్ లు కోర్టుకు తెలియజేయడం జరిగిందట.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ పుష్ప 2 సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు. ఒకటి రెండు రోజుల్లోనే సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు పుష్ప 2 రాబోతుంది. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 ను పాన్‌ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. రూ.1000 కోట్లకు పైగా థియేట్రికల్‌ బిజినెస్ చేసిన పుష్ప 2 నాన్‌ థియేట్రికల్‌ రూపంలో రూ.400 కోట్లకు పైగా నిర్మాతకు తెచ్చి పెట్టిందని తెలుస్తోంది. మొత్తానికి పుష్ప 2 వెయ్యి కోట్లకు మించి వసూళ్లు సాధించాల్సి ఉంది. మరి ఆ స్థాయిలో పుష్ప 2 వసూళ్లు ఉంటాయా చూడాలి.

Exit mobile version