Advertisement

ఆయనకు నా ప్రాణం తప్ప ఏం ఇవ్వగలను..!

Posted : November 21, 2023 at 5:34 pm IST by ManaTeluguMovies

మెగా ఫ్యామిలీ నుంచి ఉప్పెన సినిమాతో పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ త్వరలో ఆదికేశవగా రాబోతున్నాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో పెద్ద మామయ్య చిరంజీవి మీద తన అభిమానం ప్రేమని చాటుకున్నాడు వైష్ణవ్ తేజ్.

పెద్ద మామయ్య పుట్టిన రోజు అందరు కాస్ట్ లీ గిఫ్టులతో వస్తున్నారు. అన్న తేజ్ కూడా కత్తి గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే తాను ఏం చేయాలా అని ఆలోచించి వెరైటీగా చిరు అని వెనక క్రాఫ్ కట్ చేయించాను. దాన్ని మామయ్య చూసి నవ్వుకున్నారు. ఆయన కోసం ఏం ఇవ్వగలను నా ప్రాణం తప్ప అని మామయ్య మీద తన ప్రేమను చాటుకున్నారు వైష్ణవ్ తేజ్. ఇక సాయి ధరం తేజ్ యాక్సిడెంట్ ఒక చేదు జ్ఞాపకం అని. ఆ విషయాన్ని మా ఫ్యామిలీ మర్చిపోయిందని అన్నారు.

ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ జరిగితే రాం చరణ్ చాలా హుందాగా ఉంటాడని అల్లరి అంతా తేజ్ అన్నయ్య చేస్తాడని అన్నారు. కెరీర్ లో తనకు వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళ్తానని చెబుతున్న వైష్ణవ్ తేజ్ మంచి పాత్ర అయితే విలన్ గా చేసేందుకు కూడా తాను రెడీ అని అన్నారు. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రకైనా తాను రెడీ అన్నారు వైష్ణవ్ తేజ్.

ఆదికేశవ సినిమాతో కెరీర్ లో ఫస్ట్ టైం మాస్ అటెంప్ట్ చేశాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు మెగా హీరో. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోన్ మూవీస్ కలిసి నిర్మించారు. ఈ సినిమాకు జి వి ప్రకాష్ మ్యూజిక్ అందించారు. మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాలో విలన్ గా నటించడం విశేషం. సినిమాలో అపర్ణ దాస్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమాలు ఫెయిల్ అవడంతో ఆదికేశవ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు వైష్ణవ్ తేజ్. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ఇంప్రెసివ్ గానే ఉంది. మరి మెగా హీరోకి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

Nani and Venkatesh Hilarious Chitchat | PROMO | Hi Nanna x Saindhav

Posted : December 4, 2023 at 8:12 pm IST by ManaTeluguMovies

Nani and Venkatesh Hilarious Chitchat | PROMO | Hi Nanna x Saindhav

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement