Advertisement

ఆసుప‌త్రిలో చేరిన హీరోయిన్!

Posted : September 27, 2024 at 7:52 pm IST by ManaTeluguMovies


అంద‌మైన ఐశ్య‌ర్య ల‌క్ష్మి ఇప్పుడిప్పుడే న‌టిగా బిజీ అవుతోంది. సౌత్ లో అన్ని భాష‌ల్లోనూ అవ‌కాశాలు అంద‌కుం టోంది. స‌హ‌జ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వుతుంది. తాజాగా ఈ క్యూటీ ఆసుప‌త్రి పాలైంది. అమ్మ‌డు ఆసుప‌త్రి నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేయ‌డంతో విష‌యం బ‌య‌ట ప‌డింది. ఇదిగో ఇక్క‌డిలా అమ్మ‌డు అనారోగ్యానికి గురైన స‌మ‌యంలో చేతికి సెలైన్ ఎక్కించుకుంది. ఆ బ్యాండేజ్ ను చూపిస్తూ సెల్పీలిచ్చింది.

మ‌రి సడెన్ గా ఏమైందో గానీ అమ్మ‌డు మాత్రం న‌వ్వుతూ సంతోషంగానే క‌నిపిస్తుంది. అనారోగ్యం నుంచి కోలుకుంది. అయితే ఆసుప‌త్రిలో ఏ కార‌ణ‌గా చేరాల్సి వ‌చ్చింది? అన్న‌ది మాత్రం రివీల్ చేయ‌లేదు. తమిళ్ గ్లామరస్ బ్యూటీ మలయాళలో చాలా సినిమాలు చేసింది. కోలీవుడ్ లో `యాక్షన్` అనే సినిమాతో పరిచయం అయ్యింది. అటుపై సత్యదేవ్ హీరోగా నటించిన `గాడ్సే` తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

ఆ తర్వాత `అమ్ము` అనే సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలుకూడా పెద్ద‌గా ఆడ‌లేదు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన `పొన్నియన్ సెల్వన్` లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. తమిళ్ లో తెరకెక్కిన `మట్టి కుస్తీ` సినిమాలోనూ నటించింది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే మలయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన `కింగ్ ఆఫ్ కొత` సినిమాలో నటించింది.

వీటితో అమ్మ‌డికి మంచి గుర్తింపు ద‌క్కింది. ప్ర‌స్తుతం మెగా మేన‌ల్లుడు సాయి ధుర్గ తేజ్ నటిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. `విరూపాక్ష` త‌ర్వాత సాయితేజ్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. అలాంటి ప్రాజెక్ట్ లో భాగ‌మవ్వ‌డం ఐశ్వ‌ర్య ల‌క్ష్మికి క‌లిసొచ్చే అంశం.


Advertisement

Recent Random Post:

Jani Master Bail Updates : జానీ మాస్టర్ కు బిగ్ షాక్.. బెయిల్ రద్దు..? | National Film Award

Posted : October 7, 2024 at 1:09 pm IST by ManaTeluguMovies

Jani Master Bail Updates : జానీ మాస్టర్ కు బిగ్ షాక్.. బెయిల్ రద్దు..? | National Film Award

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad