Advertisement

ఆ ఒక్క మాట నాని గొప్పతనానికి నిదర్శనం

Posted : September 4, 2024 at 10:22 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్‌ లో ప్రస్తుతం ఉన్న యంగ్‌ హీరోల్లో చాలా తక్కువ మంది ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా వచ్చారు. అలాంటి వారిలో నేచురల్‌ స్టార్ నాని ఒకరు అనడంలో సందేహం లేదు. క్లాప్‌ బాయ్ గా, అసిస్టెంట్‌ డైరెక్టర్ గా కెరీర్‌ ని ఆరంభించిన నాని తక్కువ సమయంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి, హీరోగా చేసిన కొన్ని సినిమాలతోనే స్టార్‌ గా గుర్తింపు దక్కించుకొని, నేచురల్‌ స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. నాని హీరోగా సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ఉంది. నటుడిగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కూడా నాని పలు సందర్భాల్లో నిరూపించుకున్నాడు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇండస్ట్రీలో తీవ్రమైన పోటీ ఉంది. ఇలాంటి సమయంలో తన సినిమాలాంటి సినిమాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, కానీ కొత్త కాన్సెప్ట్‌ లతో, కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ కథలతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఆధరించాలని నాని చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల ఆయన ’35 చిన్న కథ కాదు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో పాల్గొన్నాడు. ఆ సినిమాకు తనకు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు రానా సమర్పకుడు అవ్వడంతో పాటు, గతంలో నానితో కలిసి నటించిన నివేదా థామస్ హీరోయిన్‌ గా నటించడం వల్ల ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తుంది.

35 చిన్న కథ కాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ… కొత్త టాలెంట్ ను వెతికి పట్టుకోవడంలో రానా తర్వాతే మరెవ్వరైనా. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని రంగాల్లో కూడా కొత్త వారికి ప్రోత్సాహం దక్కాలని, వారిని ప్రోత్సహించే వారిలో రానా ముందు ఉంటాడు. నేను పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తలో మొదట పరిచయం అయిన రానా అంటే నాకు చాలా అభిమానం. ఖాళీ సమయం దొరికితే రానా తో సమయం గడిపేందుకు నేను ఇష్టపడుతాను. రానా తీసుకు వస్తున్న ఈ సినిమాను నేను చూశాను. సరిపోదా శనివారం వంటి సినిమాలు వస్తూనే ఉంటాయి, కానీ ఇలాంటి అద్భుత సినిమాలు మాత్రం చాలా రేర్‌ గా వస్తూ ఉంటాయి. కనుక ఈ సినిమాను మిస్‌ కావద్దని నాని అన్నాడు.

ఒక వైపు తన సరిపోదా శనివారం సినిమా థియేటర్‌ లలో ఉంది. విడుదల అయిన రెండో రోజు నుంచే భారీ వర్షాల కారణంగా వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. టాక్‌ కి తగ్గట్లుగా వసూళ్లు రాలేదని, వర్షాలు తగ్గిన తర్వాత ఆ సినిమాకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందని బాక్సాఫీస్‌ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సరిపోదా శనివారం వంటి సినిమాలు మళ్లీ మళ్లీ వస్తూ ఉంటాయి కానీ 35 చిన్న కథ కాదు సినిమాను ఆదరించండి అంటూ ప్రేక్షకులకు చెప్పడం అనేది కచ్చితంగా గొప్ప విషయం. ఈ ఒక్క మాట నాని గొప్పతనం కు నిదర్శనం అనడంలో సందేహం లేదు.


Advertisement

Recent Random Post:

Telangana : 15 ఏళ్ల తర్వాత తెలంగాణలో పెద్ద ఎన్ కౌంటర్

Posted : September 6, 2024 at 2:14 pm IST by ManaTeluguMovies

Telangana : 15 ఏళ్ల తర్వాత తెలంగాణలో పెద్ద ఎన్ కౌంటర్

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement