మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తండ్రి మమ్ముట్టి బాటలో కాకుండా తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ముఖ్యంగా అతను చేస్తున్న తెలుగు సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. మహానటితో తెలుగు తెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్, ఆ తర్వాత సీతారామం తో సూపర్ హిట్ అందుకున్నాడు. లేటెస్ట్ గా లక్కీ భాస్కర్ అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ నిర్మించారు.
ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో తన తెలుగు కెరీర్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు దుల్కర్ సల్మాన్. మలయాళంలో సినిమాలు చేసే టైం లోనే తమిళ్ నుంచి ఆఫర్లు వచ్చాయని అక్కడ రెండు సినిమాలు చేశా ఆ తర్వాత హిందీలో ఆఫర్ రాగా అక్కడ చేశా. తెలుగులో మొదట దిల్ రాజు ఒక ఆఫర్ ఇచ్చారు. కానీ దాన్ని తాను సరిగా చేయగలనా లేదా అన్న ఆలోచన ఉండటంతో ఆ ఆఫర్ కాదనాల్సి వచ్చింది. తన వల్ల వాళ్లు ఇబ్బంది పడకూఅదని అలా చేశా. ఆ తర్వాత మహానటి ఆఫర్ వచ్చింది. ఐతే తనకు నాగ్ అశ్విన్ అండ్ టీం చాలా సపోర్ట్ గా నిలిచారని చెప్పుకొచ్చాడు దుల్కర్ సల్మాన్.
తెలుగులో తాను పొందుతున్న ఈ అభిమానం.. ఈ క్రెడిట్ అంతా కూడా వారికే దక్కుతుందని అన్నాడు దుల్కర్ సల్మాన్. ఇక తను ఈమధ్య ఎక్కువగా పీరియాడికల్ సినిమాలే చేయడానికి కారణం ప్రత్యేకంగా ఏమి లేదని ఆ కథలు బాగుండటం వల్లే చేస్తున్నానని చెప్పుకొచ్చారు. పీరియాడికల్ సినిమాలు చేస్తున్న టైం లో డిఫరెంట్ గెటప్స్ లో ఉన్నప్పుడు దుల్కర్ భార్య సెట్స్ కి వచ్చి తనని మిస్ అవుతున్నానని చెప్పేదని వెల్లడించారు.
మమ్ముట్టి కొడుకుగా కమర్షియల్ సినిమాలు చేసి కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించే ఛాన్స్ ఉంది. కానీ సినిమా పట్ల దుల్కర్ కి ఉన్న కమిట్మెంట్ ఏంటన్నది అతను ఎంచుకున్న కథలను బట్టి చూస్తే అర్ధమవుతుంది. ముఖ్యంగా తెలుగు మేకర్స్ దుల్కర్ కోసం కొత్త కొత్త కథలతో వస్తున్నారు. లక్కీ భాస్కర్ సినిమా కూడా అలాంటి కోవలోకే వస్తుంది.
అక్టోబర్ 31న రిలీజ్ అవుతున్న లక్కీ భాస్కర్ సినిమా పాన్ ఇండియా వైడ్ భారీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో దుల్కర్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. డైరెక్టర్ అండ్ చిత్ర యూనిట్ లక్కీ భాస్కర్ రిజల్ట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.