Advertisement

ఆ రెండు సినిమాలు వరుణ్ తేజ్ కు పడుంటేనా?

Posted : November 13, 2024 at 2:32 pm IST by ManaTeluguMovies

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తొలి ప్రేమ’. ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వెంకీ అట్లూరి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో, అప్పటి నుంచే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. వెంకీ ఇటీవల ‘లక్కీ భాస్కర్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో, ఇలాంటి కథను వరుణ్ తో ఎందుకు చేయలేదనే కామెంట్లు వినిపించాయి.

దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఈరోజుతో 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకముందు ఆయన డైరెక్ట్ చేసిన ‘సార్’ సినిమా కూడా వంద కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. నిజానికి ‘లక్కీ భాస్కర్’ స్టోరీ గురించి వెంకీ అట్లూరి ముందుగా వరుణ్ తేజ్ దగ్గరే డిస్కస్ చేశాడట. ‘సార్’ సినిమా కథను కూడా వినిపించాడని ఇటీవల వరుణ్ చెప్పారు.

వెంకీ ఏ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా మొదట తనకే చెబుతాడని ‘మట్కా’ ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ తెలిపారు. ‘లక్కీ భాస్కర్’ కథ తనకు చెప్పినప్పుడు బాగా అనిపించిందని, కానీ ‘సార్’ సినిమా చేయాలని ఉండేదని వరుణ్ తేజ్ అన్నారు. కాకపోతే దర్శకుడు అప్పటికే తమిళ హీరో ధనుష్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడని చెప్పారు. కానీ ఫ్యూచర్ లో తప్పకుండా వెంకీ అట్లూరితో సినిమా చేస్తానని వరుణ్ క్లారిటీ ఇచ్చారు.

ఒకవేళ ‘సార్’ ‘లక్కీ భాస్కర్’ సినిమాలను వరుణ్ తేజ్ చేసుంటే, ఆయన కెరీర్ నెక్స్ట్ లెవల్ కు చేరిపోయేదని మెగా అభిమానులు భావిస్తున్నారు. ప్రతి కథ పైనా హీరో పేరు రాసి ఉంటుందని ఇండస్ట్రీలో అందరూ అంటుంటారు. వెంకీ అట్లూరి రాసుకున్న ఈ రెండు స్టోరీలు ధనుష్, దుల్కర్ సల్మాన్ లకు రాసి పెట్టి ఉన్నాయని అనుకోవాలి అంతే. భవిష్యత్ లో వెంకీ ఒక అధ్బుతమైన స్క్రిప్టుతో వరుణ్ తో సినిమా చేస్తాడేమో చూడాలి.

ఇకపోతే వరుణ్ తేజ్ మరికొన్ని గంటల్లో ‘మట్కా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ మూవీ, రేపు నవంబరు 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈరోజు యూఎస్ ప్రీమియర్స్ పడనున్నాయి. ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. వరుణ్ ఈసారి బ్లాక్ బస్టర్ హిట్టు కొడతారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

మట్కా తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ హారర్ కామెడీ చేయనున్నారు వరుణ్ తేజ్. అలానే మైత్రీ మూవీ మేకర్స్ ఓ మూవీ కమిట్ అయ్యారు. విక్రమ్ సిరికొండ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తారు. ఇదే క్రమంలో తన సోదరి నిహారిక కొణిదల ప్రొడక్షన్స్ లో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేసేందుకు వరుణ్ సిద్ధంగా ఉన్నారని సమాచారం.


Advertisement

Recent Random Post:

JAAT Teaser | Sunny Deol | Randeep Hooda | Vineet Kumar Singh | Gopichandh Malineni | Thaman S

Posted : December 6, 2024 at 4:53 pm IST by ManaTeluguMovies

JAAT Teaser | Sunny Deol | Randeep Hooda | Vineet Kumar Singh | Gopichandh Malineni | Thaman S

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad