Advertisement

ఆ హీరోల యాక్టింగ్.. యష్ కు నచ్చలేదట

Posted : November 6, 2024 at 2:30 pm IST by ManaTeluguMovies

కోలీవుడ్ స్టార్ హీరో యష్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బ్యాక్‌ స్టేజ్‌ ఆర్టిస్ట్‌ గా వర్క్ చేసి.. చాలా కష్టపడి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నారు. నేషనల్ వైడ్ గా ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. త్వరలో కేజీఎఫ్-3 కూడా చేయనున్నారు. ప్రస్తుతం బిజీగా ఉన్నానని, ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ ప్రాజెక్టు మొదలు పెడతామని చెప్పారు.

యష్ ఇప్పుడు హీరోగా టాక్సిక్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ తెరకెక్కిస్తున్న ఆ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. రీసెంట్ గా సినిమాకు సంబంధించిన పలు విషయాలు చెప్పి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు యష్. దాంతోపాటు బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ ప్రాజెక్ట్ లో కూడా నటిస్తున్నారు. రావణాసురుడు రోల్ లో యాక్ట్ చేస్తున్నట్లు రీసెంట్ గా ఆయన ధ్రువీకరించారు.

అయితే రామాయణ్ లో రాముడిగా రణబీర్ నటిస్తుండగా.. ఆయన కోసం యష్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐదేళ్ల క్రితానికి చెందిన ఆ వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. అందులో సంజు మూవీలో రణబీర్ అదరగొట్టారని తెలిపారు యష్. కానీ కొన్ని సినిమాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో నటించలేదని చెప్పారు. దీంతో తన యాక్టింగ్ పెద్దగా నచ్చదని, ఆయన కెరీర్ లో సంజు మూవీ పెర్ఫార్మన్స్ అద్భుతమైనదిగా వర్ణించారు.

మరోవైపు, రణవీర్ కోసం కూడా మాట్లాడారు యష్. తనకు ఆయన నటనను ముందుగా నచ్చేది కాదని తెలిపారు. కానీ బాజీరావ్ మస్తానీ మూవీ రణవీర్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పారు. అందులో అద్భుతంగా నటించారని కొనియాడారు. పద్మావత్ మూవీలో తన రోల్ లో ఒదిగిపోయారని ప్రశంసించారు. బాలీవుడ్ ఐకాన్స్ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ గా తెలిపారు యష్. అయితే యష్ ఐదేళ్ల క్రితం ఆ కామెంట్స్ చేయగా..

ఆ తర్వాత రణవీర్, రణబీర్ తమ సినిమాలతో సత్తా చాటారనే చెప్పాలి. కొన్ని ఫ్లాపులు ఎదుర్కొన్నప్పటికీ రణవీర్ గత ఏడాది కరణ్ జోహార్ నిర్మించిన రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో కమ్ బ్యాక్ ఇచ్చారు. రణబీర్.. గత ఏడాది యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి ఫ్యూచర్ లో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.


Advertisement

Recent Random Post:

MLA Kaushik Reddy Arrested : BRS ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌

Posted : December 5, 2024 at 12:01 pm IST by ManaTeluguMovies

MLA Kaushik Reddy Arrested : BRS ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad