Advertisement

ఆ హృదయం వెనుక సీక్రెట్ అద‌న్న మాట‌!

Posted : November 2, 2024 at 3:02 pm IST by ManaTeluguMovies

స‌క్సెస్ అయిన భ‌ర్త వెనుక భార్య ఉందంటారు. అందుకు ఉదాహ‌రాణ చాలా మంది స్టార్ హీరోలున్నారు. త‌మ జీవితాల్లోకి భార్య‌లు వ‌చ్చిన త‌ర్వాత చోటు చేసుకున్న మార్పులు..అందుకున్న విజ‌యాలు ప్ర‌మాణికంగా చెప్పొచ్చు. మ‌హేష్ వెనుక న‌మ్ర‌త‌..రామ్ చ‌ర‌ణ్ వెనుక ఉపాస‌న‌లు మాత్రం కీల‌క పాత్ర ధారులు. మ‌హేష్ భార్య న‌మ్ర‌త పెళ్లికి ముందు పెద్ద మోడ‌ల్. ముంబైలో పుట్టి పెరిగింది. ఫ్యాష‌న్ ప‌రంగా ఎంతో అడ్వాన్స్ గా ఉంటుంది.

మ‌హేష్ లో ఆ ఫ్యాషెన్ సెన్స్ వెనుక న‌మ్రత కీల‌క పాత్ర ధారి. మ‌హేష్ వేసుకునే దుస్తుల‌న్నీ న‌మ్ర‌త ఎంపిక చేసినవే. ఈ విష‌యాన్ని చాలా సంద‌ర్భాల్లో మ‌హేష్ ఓపెన్ గానే చెప్పారు. తనలో ఆఛేంజ్ వెనుక కార‌ణం న‌మ్ర‌త అనే అంటారు. అలాగే కోలీవుడ్ హీరో సూర్య లో కూడా ఫ్యాషెన్ సెన్స్ వెనుక కార‌కురాలు భార్య జ్యోతిక అని ఆల‌స్యంగా చెప్పారు. గ‌జినీ సినిమాలో `హృద‌యం ఎక్క‌డున్నాది` సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు.

అదో ట్రెండ్ సెట్ట‌ర్ సాంగ్ . ఇప్ప‌టికీ కాల‌ర్ టోన్ గా, రింగ్ టోన్ గా మారుమ్రోగుతూనే ఉంటుంది. అందులో సూర్య వేసుకున్న ఫ్యాష‌న్ దుస్తులు ఎవ‌రు డిజైన‌ర్ అనుకుంటున్నారు? జ్యోతిక‌నే. ఆ పాట‌కు సంబంధించి ప్ర‌త్యేకంగా తానే ఆ డిజైన్స్ అన్నింటిని ఎంపిక చేసిందిట‌. సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నా? ఆ పాట‌కు మాత్రం జ్యోతిక ఛార్జ్ తీసుకుని సూర్య ఈ పాట‌కి ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుంది అని స‌ల‌హా ఇవ్వ‌డంతో ఆమెని ఫాలో అయిన‌ట్లు సూర్య తెలిపారు.

అప్ప‌టి నుంచి జ్యోతిక ఎంపిక చేసిన దుస్తులే కొంటాన‌న్నారు. జ్యోతిక‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత త‌న‌లో వ‌చ్చిన మార్పుల‌కు భార్య‌నే కార‌ణంగా చెప్పుకొచ్చారు. వ్య‌క్తిగ‌తంగా త‌న కోసం ఎంతో శ్ర‌మిస్తుంద‌ని..ఎన్నో త్యాగాలు సైతం చేస్తుంద‌న్నారు.


Advertisement

Recent Random Post:

అల్లు అర్జున్ పక్కన డ్యాన్స్ చేస్తున్నప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉందంటే.. : Sreeleela | Pushpa 2

Posted : December 2, 2024 at 9:47 pm IST by ManaTeluguMovies

అల్లు అర్జున్ పక్కన డ్యాన్స్ చేస్తున్నప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉందంటే.. : Sreeleela | Pushpa 2

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad