Advertisement

ఈ సూప‌ర్ క‌పుల్.. ఒకే వ‌ర‌లో రెండు కత్తులు!

Posted : September 30, 2024 at 7:19 pm IST by ManaTeluguMovies

ఒకే వ‌ర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ్చ‌డం ఎలా? అలా చేస్తే తేడాలొచ్చేందుకు ఆస్కారం ఉంది. కానీ ఎలాంటి తేడా లేకుండా సూప‌ర్ హిట్లు కొడుతూనే జాతీయ అవార్డులు అందుకునే సినిమాలు తీస్తున్నారు జ్యోతిక‌- సూర్య జంట‌. 2డి ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ స్థాపించి అభిరుచి ఉన్న సినిమాల‌ను నిర్మిస్తున్న జంట‌గా వీరు పాపుల‌ర‌వుతున్నారు.

ఇంత‌కుముందు సుర‌రై పొట్రు (ఆకాశం నీ హ‌ద్దురా-తెలుగులో) లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని తెర‌కెక్కించారు. ఈ సినిమాకి జాతీయ అవార్డులు రావ‌డం ఒకెత్తు. ఉత్త‌మ సినిమా- ఉత్త‌మ న‌టుడు-ఉత్త‌మ న‌టి పుర‌స్కారాల‌ను గెలుచుకుంది ఈ చిత్రం. ఇక ఇదే బ్యాన‌ర్ నుంచి ఆల్మోస్ట్ ఆస్కార్ రేసులో నామినేష‌న్ కి పంపిన జై భీమ్ లాంటి చిత్రం కూడా తెర‌కెక్కింది. జై భీమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం. నిజానికి ఎనిమిదేళ్ల‌ విరామం తర్వాత జ్యోతిక `36 వయధినిలే`తో తిరిగి న‌ట‌న‌లోకి వచ్చింది. 2డి ఎంట‌ర్ టైన్ మెంట్ లో రూపొందించిన ఈ సినిమా ఇన్ స్టంట్ హిట్. ఆ త‌ర్వాత‌ దశాబ్ద కాలంగా సూర్య – జ్యోతిక పలు విజ‌య‌వంత‌మైన చిత్రాలను నిర్మించారు. ఇటీవ‌లే ఈ బ్యాన‌ర్ నుంచి విడుద‌లైన స‌త్యం సుంద‌రం కూడా బ‌ల‌మైన ఎమోష‌న్స్ ఉన్న సినిమాగా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దేవ‌ర లాంటి భారీ చిత్రంతో పోటీప‌డుతూ విడుదలైన ఈ సినిమాకి థియేట‌ర్ల‌లో ఆద‌ర‌ణ ద‌క్కుతోంద‌ని స‌మాచారం.

అయితే ద‌శాబ్ధ కాలం పాటు కలిసి న‌టించిన ఈ జంట‌, మ‌రో ద‌శాబ్ధ కాలంగా క‌లిసి సినిమాలు నిర్మిస్తున్నారు. వీరు మంచి అభిరుచితో తెస్తున్న సినిమాలు ప్ర‌జ‌ల‌కు గొప్ప వినోదం పంచుతున్నాయి. సూప‌ర్ హిట్ లు ఒక వైపు.. అవార్డులు రివార్డులు మ‌రోవైపు.. ఒకే వ‌ర‌లో బాగా ఒదిగాయంటే ఈ జంట అభిరుచి ప్ర‌ధాన కార‌ణం. జ్యోతిక‌- సూర్య దంప‌తులు కోలీవుడ్ ఆద‌ర్శ జంట‌గా త‌మ పిల్ల‌ల‌ను గొప్ప స్థాయిల‌కు ఎదిగేందుకు సాకుతూనే, న‌టులుగా, నిర్మాత‌లుగా మంచి పేరు తెచ్చుకుంటున్న వైనం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్, న‌టీన‌టులు అంద‌రికీ స్ఫూర్తి.


Advertisement

Recent Random Post:

నాగార్జునపై కేసులు పెడతాం..! | Konda Surekha Lawyer on Nagarjuna |

Posted : October 7, 2024 at 7:27 pm IST by ManaTeluguMovies

నాగార్జునపై కేసులు పెడతాం..! | Konda Surekha Lawyer on Nagarjuna |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad