Advertisement

కంగువా: 1000 కోట్ల ఆశతో హద్దులు దాటేశారా?

Posted : November 8, 2024 at 6:10 pm IST by ManaTeluguMovies

సూర్య హీరోగా పాత్రలో శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంగువ’ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకు చిత్ర యూనిట్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ లో కూడా బాహుబలి బాటలో వస్తున్న సినిమా అని చెబుతున్నారు. పక్కా 1000 కోట్ల బొమ్మ అంటూ బాక్సాఫీస్ వద్ద ఆశలు పెంచేస్తున్నారు. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, కోలీవుడ్‌కి పాన్ ఇండియా మార్కెట్లో మరింత ప్రాధాన్యతను ఇస్తుందని భావిస్తున్నారు.

విజువల్స్ అయితే ఊహించని రేంజ్ లోనే ఉంటాయని చెబుతున్న విధానం అందరిలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య మాట్లాడిన విధానం చూస్తే.. ‘కంగువ’ మూవీ విజువల్స్ తో ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లనుందని, సినిమా విడుదల తరువాత ప్రేక్షకులే కాకుండా భారతీయ ఫిల్మ్ మేకర్స్ కూడా ఆశ్చర్యపోతారని అతను ధీమాగా చెప్పడం అందరిలోనూ క్యూరియాసిటీని పెంచింది.

ఈ సినిమా నాన్ స్టాప్ యాక్షన్, అద్భుతమైన విజువల్స్‌తో కూడిన చక్కని కథతో ఉండటమే కాకుండా, ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మాణ విలువలను కలిగి ఉంటుందని అంటున్నారు. అలాగే ఊహించని సర్ ప్రైజ్ లు ఎన్నో ఉంటాయని చెప్పారు. కార్తీ ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తాడు అని ఆ మధ్య ఒక టాక్ అయితే వచ్చింది. ట్రైలర్ చివర్లో వచ్చిన కొన్ని సన్నివేశాలను చూస్తే, కార్తి ‘కాష్మోరా’ సినిమాలోని వైలెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడని అనుమానాలు పెరుగుతున్నాయి.

మరి సూర్య చెప్పిన సర్ ప్రైజ్ అదేనా లేక మరేదైనా ఉందా అన్నది చూడాలి. కంగువా టీమ్ మాత్రం ఆ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా ఎన్నో ఊహించని సర్ ప్రైజ్ లు ఉంటాయని హామీ ఇస్తోంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లు దేశ వ్యాప్తంగా ఊపందుకున్నాయి. కానీ,ఇంతటి ప్రమోషన్‌లో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, సూర్య అలాగే కంగువ టీమ్ సినిమా గురించి చెప్పే మాటలు అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయినా పరిస్థితి ఊహించని విధంగా ఉంటుంది. ఆ అంచనాలకి తగ్గట్టు సినిమా ఉంటే అదృష్టం కానీ, వాటిని అందుకోలేకపోతే అప్పుడు అది నెగటివ్ టాక్‌కి కారణం కావచ్చు.

రీసెంట్ గా వచ్చిన దేవర సినిమా విషయంలో చిత్ర యూనిట్ అతిగా ప్రమోట్ చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా చేయలేదు. అదే సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఈవెంట్ చేసినా ప్రమోషన్స్ అతిగా చేసినా ప్రేక్షకుల ఊహలు మారిపోతాయి. వారి అంచనాలను అందుకోవడం చాలా కష్టం. అందుకే దేవర టీమ్ తెలివిగా నడుచుకుంది. ఇక విడుదల అనంతరం టాక్ అటు ఇటుగా ఉన్న కలెక్షన్లు స్ట్రాంగ్ గా వచ్చాయి. అయితే ఇప్పుడు కంగువా బార్డర్ లైన్ దాటి మరి సినిమాను హై రేంజ్ లో ప్రమోట్ చేస్తోంది. అసలే 1000 కోట్లు వేగంగా కొడుతోందని అంటున్నారు. మరి ఆ రేంజ్ లో సినిమా క్లిక్కవుతుందో లేదో చూడాలి.


Advertisement

Recent Random Post:

జగన్ మీద నా ఒపీనియన్ అదే..!! : Ram Gopal Varma About YS Jagan | RGV Case

Posted : December 2, 2024 at 12:05 pm IST by ManaTeluguMovies

జగన్ మీద నా ఒపీనియన్ అదే..!! : Ram Gopal Varma About YS Jagan | RGV Case

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad