నిశబ్దం చిత్రం ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో అనుష్క ఎట్టకేలకు కాస్టింగ్ కౌచ్ గురించి క్లారిటీ ఇచ్చింది. తనకు ఎప్పుడు కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురు కాలేదని చెప్పుకొచ్చింది. నేను ఎప్పుడు కూడా ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిని కనుక నన్ను ఎవరు కూడా ఇబ్బంది పెట్టే సాహసం చేయలేదు అన్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినిమా పరిశ్రమలోనే కాకుండా పలు ప్రాంతాల్లో వర్కింగ్ ప్రదేశాల్లో కూడా ఉందని చెప్పుకొచ్చింది.
మహిళలు ఏ రంగంలో అయినా నిలదొక్కుకోవాలంటే రెండు మార్గాలు ఉంటాయి. అందులో ఒకటి కఠినమైనది రెండవది రాజీ పడటం. నేను కఠినమైన మార్గంను ఎంచుకున్నాను. నా మార్గంలో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని చెప్పుకొచ్చింది. నిశబ్దం చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనుష్క సక్సెస్ను అందుకుంటాననే నమ్మకంతో ఉంది. మరి ఈ అమ్మడి కెరీర్లో నిశబ్దం ఎలాంటి శబ్దంను చేయబోతుందో చూడాలి.