ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

క్యారెక్టర్ కోసం హీరో డెడికేషన్ అదుర్స్..!

ఒక సినిమా సక్సెస్ అయితే ఆ హిట్ క్రెడిట్ లో ఎక్కువ శాతం డైరెక్టర్ కన్నా హీరోకే వెళ్తుంది. స్టార్ ఇమేజ్ కావొచ్చు.. అభిమాన గళం కావొచ్చు.. సినిమా హిట్టు పడింది అంటే ఇది మా వాడి రేంజ్ అని కాలర్ ఎగరేసి మరీ చెప్పుకుంటారు ఫ్యాన్స్. ఐతే ఆ హిట్టు సినిమా తీసేందుకు హీరో పడే కష్టాలు.. చేసే రిస్కులు చాలా తక్కువ మందికి తెలుసు. ఒక సినిమాను రెండు గంటల్లో చూసి రెండు నిమిషాల్లో జడ్జ్ చేసి చెప్పేస్తాం కానీ ఆ రెండున్నర గంటల సినిమా కోసం రెండేళ్లు శ్రమ పడతారు చిత్ర యూనిట్.

ఐతే ఎంత కష్టపడ్డా ఎన్నేళ్లు కష్టపడ్డా అవుట్ అండ్ అవుట్ గా ఆడియన్స్ కు నచ్చాల్సిందే. కానీ సినిమా కోసం హీరో పడే కష్టాన్ని మేకింగ్ వీడియోస్ లో చాలా తక్కువ చూపిస్తారు కానీ తెర వెనక అతను క్యారెక్టర్ కోసం పడే కష్టం అంతా ఇంతా కాదు. కచ్చితంగా సక్సెస్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వచ్చిన అవకాశం కోసం ఒళ్లు హూనం చేసుకుంటారు స్టార్స్. అలా ప్రస్తుతం తన సినిమా కోసం డెడికేషన్ తో తనని తాను మార్చుకున్నాడు హీరో రాం.

పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కాగా దానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కించారు. మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం రాం పడిన కష్టం పెట్టిన ఎఫర్ట్స్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్కంద కోసం భారీగా బరువు పెరిగిన రాం డబుల్ ఇస్మార్ట్ కోసం ఏకంగా 18 కిలోలు తగ్గాడు. అది కూడా ఒక నెల రెండు నెలల్లోనే.

దీని కోసం ఎంతో శ్రమ పడినట్టు తెలుసుతుంది. ఇస్మార్ట్ శంకర్ ఎండింగ్ లో ఉన్న శంకర్ లుక్ కోసం ఇంకా డబుల్ ఇస్మార్ట్ లో కూడా అదే లుక్ కొనసాగించేలా తన లుక్ మార్చేసినట్టు చెప్పుకొచ్చారు రాం. డబుల్ ఇస్మార్ట్ కోసం దాదాపు 20 కిలోల దాకా వెయిట్ తగ్గించారట. దీని కోసం యూఎస్ వెళ్లి అక్కడ భారీ వర్క్ అవుట్స్ చేసినట్టు రాం రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కు మరోసారి మణిశర్మ మ్యూజిక్ హెల్ప్ అవుతుందని తెలుస్తుంది.

Exit mobile version