Advertisement

గేమ్ చేంజర్ మెలోడీ మ్యాజిక్.. గెట్ రెడి!

Posted : November 27, 2024 at 2:07 pm IST by ManaTeluguMovies

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే టీజర్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేదు. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ చేసేలా అదిరిపోయే అప్డేట్ కావాలని కోరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఆ సాంగ్స్ కి కూడా ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ గా మెలోడీని తీసుకొని రాబోతున్నారు. నవంబర్ 28న ఈ సాంగ్ రిలీజ్ కాబోతోంది. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక శంకర్ సినిమాలలో సాంగ్స్ అంటే విజువల్ గా లార్జర్ దెన్ లైఫ్ అనేలా ఉంటాయి. మచ్చా మచ్చారే సాంగ్ చాలా గ్రాండియర్ గా ఉండబోతోందని విజువల్ తో క్లారిటీ ఇచ్చారు.

ఈ సారి రాబోయే మెలోడీ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. ఈ సాంగ్ కి సంబందించిన ప్రోమోని థమన్ ట్విట్టర్ లో వదిలాడు. రామజోగయ్య శాస్త్రీ రాసిన లిరిక్స్ కి శ్రియా ఘోషల్, కార్తీక్ అదిరిపోయే వోకల్ ఇచ్చారని ఈ ప్రోమోతో అర్ధమవుతోంది. నానా హైరానా అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ కచ్చితంగా అందరికి కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలో ఆడియన్స్ కూడా మెలోడీ బీట్స్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. గేమ్ చేంజర్ లో ఈ నానా హైరానా సాంగ్ కూడా అలాగే క్లిక్ అవుతుందని అంచనా వేస్తున్నారు. త్వరలో ఈ సాంగ్ రిలీజ్ ఉంటుందని థమన్ ట్వీట్ లో క్లారిటీ ఇచ్చారు. అలాగే థమన్ స్వరపరిచిన అద్భుతమైన ఈ మెలోడీ తనకి బాగా ఇష్టమైన సాంగ్స్ లలో ఒకటిగా ఉండబోతోందని శ్రియ ఘోషల్ చెప్పింది. అలాగే సింగర్ కార్తీక్ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

మెగా ఫ్యాన్స్ కి ఇది కచ్చితంగా మంచి ట్రీట్ అవుతుందని భావిస్తున్నారు. థమన్ నుంచి చాలా రోజుల తర్వాత ఓ మంచి మెలోడీగా వస్తోన్న ఈ సాంగ్ తో సినిమాకి కొంత హైప్ తీసుకొస్తుందని అనుకుంటున్నారు. కియారా అద్వానీ, రామ్ చరణ్ పై ఈ మెలోడీ డ్యూయెట్ ఉండబోతోంది. ‘గేమ్ చేంజర్’ మూవీలో అంజలి మరో హీరోయిన్ గా నటించింది. ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. శ్రీకాంత్ కీలక పాత్రలో నటించారు.


Advertisement

Recent Random Post:

మీరే హీరో మేడం.. మేము కాదు..! || Deputy Cm Pawan Kalyan Kadapa Tour

Posted : December 7, 2024 at 5:58 pm IST by ManaTeluguMovies

మీరే హీరో మేడం.. మేము కాదు..! || Deputy Cm Pawan Kalyan Kadapa Tour

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad