Advertisement

చరణ్ ఫ్యాన్స్ అలా.. మహేష్ అభిమానులు ఇలా..

Posted : October 30, 2024 at 2:59 pm IST by ManaTeluguMovies

సాధారణంగా సినీ ప్రియుులంతా తమ అభిమాన హీరోల సినిమాల కోసం ఎప్పుడూ వెయిట్ చేస్తుంటారు. రిలీజ్ ఎప్పుడు అవుతాయోనని చూస్తుంటారు. విడుదలకు ముందు వరుస అప్డేట్స్ ఇస్తారని ఆశిస్తుంటారు. అలా జరగకపోతే.. సోషల్ మీడియాలో మేకర్స్ ను ఒక్కోసారి నిలదీస్తుంటారు. కొన్నిసార్లు మేకర్స్ అప్డేట్స్ ఇచ్చేలా కూడా చేస్తుంటారు. ఇప్పుడు స్టార్ హీరోలు రామ్ చరణ్ తో పాటు మహేష్ బాబు అభిమానుల కోసం ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది.

మెగా హీరో రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. మూడేళ్ల క్రితం షూటింగ్ మొదలవ్వగా.. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని అంతా భావించినా.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ సరైన అప్డేట్స్ ఇవ్వకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టీజర్ ను రిలీజ్ చేస్తామని చెప్పినా.. డేట్ అండ్ టైమ్ ను మాత్రం ప్రకటించలేదు.

దీంతో అభిమానులంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సరైన రీతిలో ప్రమోషన్స్ నిర్వహించాలని కోరుతున్నారు. టీజర్ అండ్ సాంగ్స్ ను త్వరగా రివీల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మేకర్స్ వల్ల నిరుత్సాహానికి గురవుతున్నామని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దానికి తోడు గేమ్ ఛేంజర్ ను తెరకెక్కిస్తున్న శంకర్ చివరి మూవీ భారతీయుడు-2 బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో గేమ్ ఛేంజర్ రిజల్ట్ విషయంలో కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో చేయబోయే సినిమా కోసం మేకోవర్ చేసుకుంటున్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపిస్తున్న ఆయన.. వర్కౌట్స్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న SSMB 29 ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో మేకర్స్ బిజీగా ఉన్నారు. రాజమౌళితో పాటు ఆయన కుమారుడు కార్తికేయ.. షూటింగ్ లొకేషన్స్ ను ఫిక్స్ చేస్తున్నారట.

అందుకుగాను వారిద్దరూ ఆఫ్రికా వెళ్లినట్లు తెలుస్తోంది. రీసెంట్ జక్కన్న ట్రాటింగ్ టు డిస్కవర్ అంటూ క్యాప్షన్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. వచ్చే సంక్రాంతికి షూటింగ్ మొదలు కానుందని.. రెండేళ్లకు పైగా జరగనుందని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో మహేష్ ఫ్యాన్స్.. ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు. టైమ్ ఎక్కువ తీసుకున్నా.. సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉందని చెబుతున్నారు. మొత్తానికి చరణ్ ఫ్యాన్స్ అలా.. మహేష్ అభిమానులు ఇలా అన్నమాట!


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 2nd December 2024

Posted : December 2, 2024 at 10:12 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 2nd December 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad