Advertisement

చైతూ, శోభిత పెళ్లి.. ఆ డీల్ నిజం కాదు

Posted : November 27, 2024 at 2:04 pm IST by ManaTeluguMovies

అక్కినేని హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత దూళిపాళ్ల డిసెంబర్ లో పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న వారి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకి హాజరుకాబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సెలబ్రెటీల వివాహాలకి సంబందించిన లైవ్ స్ట్రీమింగ్ హక్కులని ఓటీటీ ఛానల్స్ కొనుగోలు చేస్తున్నాయి.

గతంలో హన్సిక, అలాగే నయనతార పెళ్ళికి సంబందించిన స్ట్రీమింగ్ రైట్స్ ని ఓటీటీ యాప్స్ కొనుగోలు చేసి టెలికాస్ట్ చేశాయి. ఇప్పుడు అదే తరహాలో చైతన్య, శోభిత వివాహ వేడుకకి సంబందించిన స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిందనే ప్రచారం తెరపైకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ ఈ రైట్స్ తీసుకుందనే కథనాలు వినిపించాయి. అయితే దీనిపై క్లారిటీ వచ్చింది.

అక్కినేని ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తోన్న సమాచారం మేరకు చైతన్య, శోభిత పెళ్లి వేడుక స్ట్రీమింగ్ హక్కులని ఏ ఓటీటీ సంస్థకి ఇవ్వలేదంట. ఈ పెళ్లి వేడుకని పబ్లిక్ చేసే ఆలోచన వారికి లేదని సమాచారం. వ్యక్తిగతంగా వారి జీవితాలలో స్పెషల్ వెకేషన్ అయిన ఈ పెళ్లి వేడుక వీడియోని ఎలాంటి ఆన్ లైన్ డిజిటల్ మాధ్యమాలలో ప్రసారం చేసే అవకాశం లేదని అక్కినేని సన్నిహితులు ఓ క్లారిటీ ఇచ్చేశారు.

ఇదిలా ఉంటే అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ మూవీ చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తిగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాయి పల్లవి ‘తండేల్’ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి బుజ్జితల్లి అనే మెలోడీ సాంగ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. యుట్యూబ్ లో ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో ఉంది.

ఇదిలా ఉంటే ఓ వైపు చైతన్య పెళ్లి పనులు జరుగుతూ ఉండగానే నాగార్జున చిన్న కొడుకు అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. ఈ విషయాన్ని నాగార్జున అఫీషియల్ గా ధృవీకరించారు. అఖిల్ ది కూడా ప్రేమ వివాహం అని తెలుస్తోంది. అఖిల్ పెళ్లి వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక అతను ప్రస్తుతం మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.


Advertisement

Recent Random Post:

Fateh | Official Teaser l Sonu Sood | Jacqueline Fernandez | In Cinemas 10th January

Posted : December 9, 2024 at 2:43 pm IST by ManaTeluguMovies

Fateh | Official Teaser l Sonu Sood | Jacqueline Fernandez | In Cinemas 10th January

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad