Advertisement

డార్క్ థీమ్ ఎఫెక్ట్.. టెన్షన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్?

Posted : November 1, 2024 at 2:34 pm IST by ManaTeluguMovies

డార్క్ థీమ్ తో సినిమాలు రూపొందిస్తూ, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. లార్జర్ దేన్ లైఫ్ క్యారక్టర్స్, ఎలివేషన్ సీన్స్, హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్, ఎమోషనల్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఈ విధంగా ‘కేజీఎఫ్’ చాప్టర్ 1 & 2, ‘సలార్’ పార్ట్-1 చిత్రాలు తీసి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. అయితే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు, డార్క్ థీమ్ తో సినిమాలు చేయడానికి మరికొందరు దర్శకులు ప్రయత్నించారు. కానీ అవేవీ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవ్వలేదు.

‘కేజీఎఫ్’ తరహాలో భారీ హంగులతో డార్క్ మూడ్‌ లో రూపొందించిన కన్నడ సినిమాలు ‘కబ్జా’, ‘మార్టిన్’. ఆడియన్స్ ఈ రెండు చిత్రాలను రిజెక్ట్ చేయడంతో, డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఇప్పుడు లేటెస్టుగా బ్లాక్ థీమ్ లో వచ్చిన చిత్రం ”బఘీర”. ప్రశాంత్ నీల్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి డా. సూరి దర్శకత్వం వహించారు. శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. కన్నడలో పర్వాలేదనిపించుకుంటున్నా, తెలుగులో మాత్రం ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది.

ప్రజల్ని రక్షించడానికి మాస్క్ మ్యాన్ అవతారం ఎత్తిన పోలీసాఫీసర్ కథతో ‘బఘీర’ సినిమా రూపొందింది. రొటీన్ స్టోరీ లైన్, యాక్షన్ సీన్స్ తో డార్క్ టోన్‌ లో ఈ సినిమా సెట్ చేయబడింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు మీదుగా తెలుగులో రిలీజ్ అయింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విధంగా పెరఫార్మ్ చేయడం లేదు. కన్నడలో ఈ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి. ఫస్ట్ డే ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది. కానీ తెలుగులో మాత్రం ప్రేక్షకులను థియేటర్‌లకి రప్పించడానికి చాలా కష్టపడుతోంది.

ప్రశాంత్ నీల్ ట్రాక్ రికార్డ్ ని బట్టి, ‘బఘీర’ కూడా భారీ వసూళ్లు రాబట్టడం గ్యారంటీ అని విడుదలకు ముందు అనుకున్నారు. కానీ తీరా రిలీజైన తర్వాత ఒక్క షో కూడా పూర్తిగా అమ్ముడుకాలేదు. మొదటి రోజు మాత్రమే కాదు, రెండో రోజు పరిస్థితి కూడా ఇలానే ఉంది. దీంతో ఆడియన్స్ కు డార్క్ థీమ్ బోర్ కొట్టేసిందేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బొగ్గు బ్యాక్ డ్రాప్ పై ఆడియన్స్ ఆసక్తి కనబరచడం లేదని, శాండిల్ వుడ్ మేకర్స్ ఏదైనా ఫ్రెష్ గా తీస్తేనే జనాలు చూస్తారని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. NTRNeel అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ యాక్షన్ మూవీ.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే ఇది నీల్ గత చిత్రాల తరహాలో డార్క్ థీమ్ లో ఉంటుందని స్పష్టమైంది. కానీ ఇప్పుడు ‘బఘీర’కు వస్తున్న రెస్పాన్స్ చూసి, తారక్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే ప్రాజెక్ట్‌ ఎలా ఉంటుందో.. నీల్ మ్యాజిక్ వర్కౌట్ అవుతుందో లేదో అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

అదే సమయంలో ”బఘీర” సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయలేదని, కేవలం కథ మాత్రమే అందించారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తే సినిమా మరోలా ఉండేదేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని భావిస్తున్నారు. అయినా అప్పుడే ‘బఘీర’ ఫలితాన్ని డిసైడ్ చేయడం సరికాదని, బాక్సాఫీస్ దగ్గర పుంజుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

పుష్ప 2.. సెవెన్ స్టార్ హోటల్ లో ఇడ్లీ లాంటిది : RGV

Posted : December 4, 2024 at 6:01 pm IST by ManaTeluguMovies

పుష్ప 2.. సెవెన్ స్టార్ హోటల్ లో ఇడ్లీ లాంటిది : RGV

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad